- Telugu News Photo Gallery Aishwarya Lekshmi Shares Stunning Photos in Her Instagram telugu movie news
Aishwarya Lekshmi: బాబోయ్.. ఐశ్వర్య అందాల అరాచకం.. ఆ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ ?..
అతి తక్కువ సమయంలో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథానాయికగా క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఈ బ్యూటీ డాక్టర్ కూడా. 2017లో విడుదలైన జందుకలుండే నత్తిన్ ఒరిదవేల్ సినిమాతో పరిచయమైంది. కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత సినిమాపై ఉన్న ఆసక్తితో సినిమా అవకాశాల కోసం
Updated on: Mar 15, 2024 | 7:57 PM

అతి తక్కువ సమయంలో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథానాయికగా క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఈ బ్యూటీ డాక్టర్ కూడా. 2017లో విడుదలైన జందుకలుండే నత్తిన్ ఒరిదవేల్ సినిమాతో పరిచయమైంది.

కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత సినిమాపై ఉన్న ఆసక్తితో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. మాయానది, వర్దన్ సినిమా వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. మట్టి కుస్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

విష్ణు విశాల్ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో తెలుగులో ఐశ్వర్యకు మంచి క్రేజ్ వచ్చింది. గతేడాది డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలోనూ కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అందం. టాలెంట్ ఉన్నా ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం ఆమడ దూరంలో ఉంది.

దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమాలో నటించింది. ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఈ బ్యూటీ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

జీన్స్ అండ్ క్రాఫ్ టాప్లో గ్లామరస్ లుక్తో మతిపోగొట్టేసింది ఐశ్వర్య. ఎప్పుడూ ట్రెడిషనల్ గా కనిపించే ఈ అమ్మడు.. ఇప్పుడు పూర్తిగా స్టైలీష్ గ్లామరస్ లుక్లో కనిపించి మైండ్ బ్లాంక్ చేసింది. ఐశ్వర్య ఈ మార్పు ఏంటమ్మా ?.. బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.




