- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu and Allu Arjun not picking up bollywood movie offers and staying in Tollywood Telugu Heroes Photos
Allu Arjun – Mahesh Babu: ఆ విషయంలో మాత్రం అల్లు అర్జున్, మహేష్ బాబు ఒక్కటే.?
ఎందుకు లేనిపోని తలనొప్పులు.. ప్రపంచం ఎటు పోతుంటే మనం కూడా అటే పోతే బెటర్ అనుకునే వాళ్లే ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటారు. కానీ తాము ట్రెండ్ ఫాలో అవ్వం.. సెట్ చేస్తామంటున్నారు అల్లు అర్జున్, మహేష్. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. ఒక్క మ్యాటర్‌లో మాత్రం బన్నీ, మహేష్ ఒకేదారిలో వెళ్తున్నారు. ఎంత ట్రై చేసినా రూట్ మారట్లేదు వాళ్లు. ఇంతకీ ఏంటా దారి..? ట్రెండ్ ఎంత మారినా.. మిగిలిన హీరోలు కూడా అటు వైపు ఆలోచిస్తున్నా..
Updated on: Mar 15, 2024 | 9:41 PM

ఎందుకు లేనిపోని తలనొప్పులు.. ప్రపంచం ఎటు పోతుంటే మనం కూడా అటే పోతే బెటర్ అనుకునే వాళ్లే ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటారు. కానీ తాము ట్రెండ్ ఫాలో అవ్వం.. సెట్ చేస్తామంటున్నారు అల్లు అర్జున్, మహేష్.

మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. ఒక్క మ్యాటర్‌లో మాత్రం బన్నీ, మహేష్ ఒకేదారిలో వెళ్తున్నారు. ఎంత ట్రై చేసినా రూట్ మారట్లేదు వాళ్లు. ఇంతకీ ఏంటా దారి..? ట్రెండ్ ఎంత మారినా.. మిగిలిన హీరోలు కూడా అటు వైపు ఆలోచిస్తున్నా..

బాలీవుడ్ నుంచి పిలుపు వస్తున్నా.. బన్నీ, మహేష్ సమాధానం ఒక్కటే.. అదే నో బాలీవుడ్ ఓన్లీ టాలీవుడ్. ఎన్నో ఏళ్లుగా ఇదే ఫాలో అవుతున్నారు ఈ ఇద్దరు.

అల్లు అర్జున్ తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండదే హవా అంతా. ఈయన కూడా ఇన్‌స్టాలో కుమ్మేస్తున్నారు. 21.3 మిలియన్ ఫాలోయర్స్‌తో రెండో స్థానంలో నిలిచారు రౌడీ హీరో. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాదు.. బిజినెస్, యాడ్స్ అన్నీ అభిమానులతో పంచుకుంటారు విజయ్.

రామ్ చరణ్ జంజీర్‌తో బాలీవుడ్‌కు వెళ్లారు.. వార్ 2తో ఇప్పుడు తారక్ వెళ్తున్నారు.. ప్రభాస్ ఆదిపురుష్‌తో ఎంట్రీ ఇచ్చారు.. కానీ బన్నీ, మహేష్ మాత్రం అటు వైపు లుక్కేయట్లేదు.

బన్నీ, మహేష్ మాత్రం ముందు నుంచి ఓకే మాటమీద ఉన్నారు. ఎప్పుడూ తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటూ.. మిగిలిన చోట్ల జెండా పాతేస్తున్నారు వాళ్లు.

కానీ అది స్నేహపూర్వకంగానే అన్నారు అల్లు అర్జున్. ఇక రాజమౌళి సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు మహేష్. మొత్తానికి తోటి హీరోలంతా ముంబైపై ఫోకస్ చేస్తున్నా.. మహేష్ బాబు, అల్లు అర్జున్ మాత్రం అంతా హైదరాబాద్ నుంచే అంటున్నారు.




