AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2024: బుందేల్‌ఖండ్‌లోని హోలికా దహన్ తర్వాత రోజున హోలీ ఆడరు.. రీజన్ ఏమిటంటే..

భారతదేశంలో హోలీని హొలీ రోజున జరుపుకోకుండా.. రెండు రోజుల తర్వాత జరుపుకునే ఒక నగరం కూడా ఉంది. అంతేకాదు హోలికా దహనాన్ని ఇక్కడ కూడా జరుపుకునే రోజువేరు. బుందేల్‌ఖండ్‌లో ప్రజలు హోలికా దహనాన్ని.. రెండవ రోజు హోలీని జరుపుకోరు. అలా కాకుండా హొలీ వెళ్లిన మూడు రోజుల తర్వాత హోలీని జరుపుకునే సంప్రదాయం ఉంది. వందల ఏళ్ల నాటి ఈ సంప్రదాయం ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతోంది.

Holi 2024: బుందేల్‌ఖండ్‌లోని హోలికా దహన్ తర్వాత రోజున హోలీ ఆడరు.. రీజన్ ఏమిటంటే..
Holi 2024
Surya Kala
|

Updated on: Mar 16, 2024 | 9:23 AM

Share

ఈ సంవత్సరం మార్చి 25న  దేశవ్యాప్తంగా హొలీ పండగ వచ్చింది. అయితే హోలీ వేడుకలు కొన్ని రోజుల ముందు నుంచే ప్రారంభమవుతాయి. దేశంలోని అనేక నగరాల్లో ప్రజలు హోలీకి ఒక నెల ముందు నుంచే  పండుగను జరుపుకోవడం మొదలు పెడతారు. మధుర, బృందావన్‌లలో ప్రజలు 40 రోజుల ముందుగానే హోలీని రంగులలో జరుపుకోవడం ప్రారంభిస్తారు, కొన్నిసార్లు ఇది పూల హోలీ, కొన్నిసార్లు ఇది లత్మార్ హోలీ ఇలా భిన్న పద్ధతుల్లో హొలీ జరుపుకుంటారు. దేశం నలుమూలల నుండి ప్రజలు హోలీని చూడటానికి ఇక్కడకు వస్తారు.

అయితే భారతదేశంలో హోలీని హొలీ రోజున జరుపుకోకుండా.. రెండు రోజుల తర్వాత జరుపుకునే ఒక నగరం కూడా ఉంది. అంతేకాదు హోలికా దహనాన్ని ఇక్కడ కూడా జరుపుకునే రోజువేరు. బుందేల్‌ఖండ్‌లో ప్రజలు హోలికా దహనాన్ని.. రెండవ రోజు హోలీని జరుపుకోరు. అలా కాకుండా హొలీ వెళ్లిన మూడు రోజుల తర్వాత హోలీని జరుపుకునే సంప్రదాయం ఉంది. వందల ఏళ్ల నాటి ఈ సంప్రదాయం ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతోంది.

హోలీ రోజున రాజును హత్య చేసిన బ్రిటిష్ వారు

బుందేల్‌ఖండ్‌లో స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి లక్ష్మీబాయి భర్త రావు గంగాధర్ హోలీ రోజున మరణించాడని, అందుకే బుందేలలు తమ రాజు మరణానికి హోలీ ఆడకుండా రోదించారని చెబుతారు. హోలీ రోజున బ్రిటీష్ వారు బుందేల్‌ఖండ్‌లో ఊచకోత కోశారు. 1858లో బ్రిటీష్ దళాలు ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి కోటను అకస్మాత్తుగా చుట్టుముట్టి దాడి చేశాయి. ఈ దాడిలో భారీ సంఖ్యలో ప్రజలు మరణించారు.

ఈ కథ కూడా ప్రజాదరణ పొందింది

బుందేల్‌ఖండ్‌లోని సాగర్ జిల్లా హత్‌ఖోహ్ గ్రామంలోని స్థానిక ప్రజలు ఇక్కడ హోలికా దహనం జరగదని నమ్ముతారు, ఎందుకంటే ఒకసారి హోలికా దహన్ సమయంలో కొన్ని గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. వాటిని ఆర్పడానికి, అక్కడి ప్రజలు జార్ఖండన్ దేవిని పూజించారు. మంటలు ఆరిపోయాయి. జార్ఖండన్ దేవి దయతో ఈ మంటలు ఆరిపోయాయని స్థానికులు నమ్ముతారు. అప్పటి నుంచి హోలికాను దహనం చేసి హోలీ జరుపుకోకుండా ఉండే సంప్రదాయం అక్కడ కొనసాగుతోంది.

ఈ ప్రాంతాల్లో కూడా సంప్రదాయాన్ని పాటిస్తున్నారు

బ్రిటీష్ వారి దాడిలో రాణి లక్ష్మీబాయి భర్త గంగాధర్ రావు మరణించిన కారణంగా బుందేల్‌ఖండ్‌లోని గ్రామాలలో ప్రజలు ఇక్కడ హోలీ జరుపుకోరు. అంతే కాకుండా మీర్‌పూర్, ఝాన్సీ, లలిత్‌పూర్, జలౌన్, బందా, మహోబా, చిత్రకూట్  లలో హోలీ జరుపుకుంటారు. మధ్య ప్రదేశ్ లోని చాలా గ్రామాల్లో హొలీ రోజు రంగులతో హొలీ ఆడరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు