తొక్కే కదాని విసిరేస్తున్నారా? ఎంత నష్టపోతున్నారో తెలుసుకోండి..
08 January 2025
TV9 Telugu
TV9 Telugu
రకరకాల పండ్లు, కూరగాయలను పీలర్‌తో చకచకా తొక్క తీసేసి చెత్తబుట్టలో వేసేయడం మనలో చాలా మందికి అలవాటే. అయితే వీటికీ ఎంతో టాలెంట్ ఉందని అంటున్నారు నిపుణులు
TV9 Telugu
యాపిల్ తినేముందు దాని తొక్కపై మైనం ఉంటుందని పొట్టు తొలగిస్తాం.. జామకాయ తొక్క వగరుగా ఉంటుందని లోపలి గుజ్జు మాత్రమే తింటాం.. అలాగే కమలాపండుని కచ్చాపచ్చాగా నమిలేసి తొక్క ఊసేస్తాం
TV9 Telugu
ఇలా కొన్ని పండ్లు, కాయగూరల తొక్క తొలగించి తినడం మనలో చాలామందికి అలవాటే! ఇకపై ఇలా చేయకండి. ఇక కాలంలో ఆరోగ్యంపై అతిశ్రద్ధ కారణంగా ఇది మితిమీరిపోయింది
TV9 Telugu
అయితే ఈ అలవాటు సంపూర్ణ పోషకాలను మన శరీరానికి అందకుండా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. పండ్లను తిని తొక్కలను పారేసే బదులు ఆ తొక్కలతో ఆరోగ్యంతోపాటు చర్మానికి మెరుపులు అద్దొచ్చు. ఎలాగంటే..
TV9 Telugu
నిమ్మ తొక్కలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే నారింజ తొక్క చర్మ రంధ్రాలను శుభ్రపరిచి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది
TV9 Telugu
అరటి తొక్కలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. పొడి చర్మం, మంటను తగ్గిస్తుంది. అలాగే బొప్పాయి తొక్కలోని ఎంజైమ్‌లు మృతకణాల చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి
TV9 Telugu
బొప్పాయి తొక్క చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.యాపిల్ పీల్స్‌లో చర్మానికి విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడతాయి. వృద్ధాప్యాన్ని నివారిస్తుంది
TV9 Telugu
మామిడిపండు తొక్కను చర్మంపై రాసుకోవడం వల్ల ముడతలు తగ్గి, తేజస్సు పెరుగుతుంది. అందుకే చేజేతులా ఈ పోషకాల్ని పడేయకుండా కనీసం ఇప్పట్నుంచైనా ఆయా పండ్ల తొక్కను తినడంతోపాటు చర్మ సౌందర్యానికి వినియోగించాలంటున్నారు నిపుణులు