'అది కుదరదు'.. నెటిజెన్‎తో జ్యోతిక.. 

07 January 2025

Battula Prudvi

జ్యోతికను ఎవరూ అడగకండి. అడిగినా ఆమె ఒప్పుకోరు. అడిగీ వేస్టే..! ఆగండాగండి... ఇంతకీ దేని గురించి ఇంత డిస్కషన్‌ అంటారా?

తీరా విషయం అంతా తెలిశాక..సీనియర్ నటి జ్యోతిక అన్నదాన్లో తప్పేంటి అని మీరు కూడా ఆమె సైడే తీసుకుంటారేమో!

అయినా ముందు విషయం గురించి మాట్లాడుకుందాం రండి... సూర్యను నాకు ఏడాది పాటు ఇస్తారా? అని ఓ నెటిజన్‌ జ్యోతికను అడిగింది.

అసలు ఎవరూ ఇలాంటి ప్రశ్నను ఎక్స్ పెక్ట్ చేయరు. అయినా, జ్యోతిక సమాధానం కూడా అందుకు తక్కువగా ఏమీ లేదనుకోండి.

'అది కుదరదు' అని సమాధానం ఇచ్చారు జ్యోతిక. భర్త పట్ల ఓ భార్య ఎంత పొసెసివ్‌గా ఉంటుందో, చెప్పకనే చెప్పేసింది ఈ సీన్‌.

అసలు జ్యోతికను చూసి అలా ఎలా అడగగలిగావ్‌ అంటూ క్వశ్చన్‌ చేసిన నెటిజన్‌ని కసురుకుంటున్నారు ఫెలో నెటిజన్లు.

ఇటీవల జ్యోతిక హిందీలో సూపర్ నాచురల్ హారర్ ఫిలిం షైతాన్ లో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక వరుస సినిమాతో దూసుకుపోతున్నారు. ఫిట్ నెస్ విషయంలో తగ్గేదెలా అంటున్నారు మిసెస్ సూర్య.