దేవర భార్య గురించి ఈ విషయాలు తెలుసా.? 

07 January 2025

Battula Prudvi

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవరలో ఆయనకు భార్యగా ఎవరు నటించిన ముద్దుగుమ్మ పేరు శ్రుతి మరాఠీ.

ఈ బ్యూటీ నేటివ్‌ ప్లేస్‌ గుజరాత్‌ రాష్ట్రం. మోడల్‌గా గ్లామర్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రుతి మరాఠీ.

ఆ తర్వాత 2008లో ఓ మరాఠీ సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమయ్యారు ఈ వయ్యారి భామ శృతి. ఈ చిత్రం ఆకట్టుకుంది.

అదే ఏడాది ఇందిర విళా అనే తమిళ్‌ సినిమాలోనూ నటించారు. ఆ సినిమాలో హేమ మాలిని అనే స్క్రీన్‌ నేమ్‌తో చేశారు శ్రుతి.

ఆ తర్వాత కూడా తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అయ్యారు ఈ బ్యూటీ.

తెలుగులో మాత్రం ఆమెకు ఇదే తొలి సినిమా. ఫస్ట్ సినిమాలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ భార్యగా నటించడం ఆనందంగా ఉందని అన్నారు శ్రుతి.

రియల్‌ లైఫ్లో ఈమెకు ఆల్రెడీ పెళ్లయింది. గౌరవ్‌ ఘట్నేకర్‌ని 2016లోనే వివాహం చేసుకున్నారు శ్రుతి మరాఠీ.

దేవర పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయింది.ఇప్పుడు అందరు ఈ సినిమా పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఇది ఇప్పట్లో వచ్చేలా లేదు.