నేను ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది: రామ్ చరణ్

08 January 2025

Basha Shek

గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో రెండు రోజుల్లో ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో మన ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది

రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రస్తుతం ప్రమోషన్లు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా నే రామ్ చరణ్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్‌కు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దానికి అతను చేసిన కామెంట్స్ కూడా వైరలయ్యాయి.

ఇప్పటివరకు మీరు నటించిన సినిమాల్లో ఏ సినిమా చేయకుండా ఉండాల్సింది అని ఫీలవుతున్నారు’ అన్న ప్రశ్న రామ్ చరణ్ కు ఎదురైంది.

దీనికి రామ్ చరణ్ స్పందిస్తూ.. అమితాబ్ ‘జంజీర్’ సినిమాను రీమేక్‌గా చేసినందుకు చింతిస్తున్నాను అని సమాధానమిచ్చాడు.

 ‘తుఫాన్’ పేరుతో రిలీజైన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది. అయితే మూవీ పెద్దగా ఆడలేదు.