Vastu Tips: చీపురుని కొనడానికి కూడా నియమం ఉందని తెలుసా.. ఈ రోజుల్లో కొంటే జ్యేష్టలక్ష్మికి ఆహ్వానం పలికినట్లే..
లక్ష్మీ దేవిని సంపదకు దేవత అని భావిస్తారు. అందుకనే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సరైన వాస్తు నియమాలను పాటించాలి. లేదంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని.. ఆ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయని నమ్మకం. చీపురులో లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల చీపురుని సరైన దిశలో పెట్టకపోయినా.. లేదా సరైన రోజున కొనుగోలు చేయకపోయినా అది లక్ష్మీ దేవిని అవమానించినట్లుగా పరిగణింప బడుతుంది. దీంతో ఆ ఇంట్లో డబ్బుకి ఇబ్బండులు వస్తాయట.

అధ్యత్మికంగానే కాదు పర్యావరణ పరంగా చీపురులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. హిందూ గ్రంథాలలో చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా పేర్కొంది. వాస్తు శాస్త్రం చీపురుని ఇంట్లో పెట్టుకునే దిశతో పాటు ఇతర చిట్కాలను కూడా అందిస్తుంది. వాస్తు ప్రకారం చీపురు లేదా చెత్తబుట్ట జీవితంలో వివిధ శుభ .. అశుభ ప్రభావాలను చూపుతుంది. చీపురు విషయంలో పాటించే వాస్తు నియమాలు ఇంటి వాతావరణాన్ని ఆనందం, శాంతి , శ్రేయస్సుతో నింపడానికి సహాయపడతాయి. చీపురులో లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల చీపుని సరైన చోట పెట్టకపోయినా.. సరైన రోజున కొనుగోలు చేయకపోయినా లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట. ఈ రోజు చీపురు విషయంలో వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం..
చీపురు ఎక్కడ ఉంచాలి: చీపురుతో పని అయిన తర్వాత దానిని పెట్టే ప్లేస్ విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ఎవరూ చూడని విధంగా గదిలో ఒక మూలలో ఉంచాలి. మీరు మీ డబ్బును ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో అలాగే మీ చీపురును కూడా జాగ్రత్తగా చూసుకోవాలని అంటారు. అలాగే చీపురు లేదా డస్ట్‌పాన్‌ను ఎప్పుడూ నిటారుగా ఉంచవద్దు. లేదా తలక్రిందులుగా పెట్టవద్దు. చీపురును ఎల్లప్పుడూ కింద పడుకోబెట్టండి.
ఎప్పుడు చీపురు కొనకూడదంటే: ఇంట్లో ఉన్న చీపురు పాతది అయ్యి.. కొత్తది కొనాలని ఆలోచిస్తుంటే.. కొనడానికి ముందు సరైన రోజు ఏమిటో తెలుసుకోండి. సోమవారం చీపురు కొనడం అశుభంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో శనివారం శనిస్వరుడి రోజు కనుక శనివారం కూడా చీపురు కొనకూడదు. ఈ రోజున చీపురు కొనడం లేదా పారవేయడం వల్ల శని దోషం కలుగుతుందని నమ్ముతారు. అంతే కాదు శుక్లపక్షంలో చీపురు కొనడం మంచిది కాదు.
చీపురు ఎక్కడ ఉంచకూడదు: డైనింగ్ రూమ్‌లో చీపుర్లు ఉంచకూడదు. నమ్మకం ప్రకారం డైనింగ్ రూమ్‌లో చీపురు పెట్టుకోవడం వల్ల ఇంటికి పేదరికం వస్తుంది. ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది.
కొత్త ఇంటిని శుభ్రపరచడం: కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు, మురికి, దుమ్మును తొలగించడానికి చీపురు చాలా అవసరం. అయితే ఇంటిని పాత చీపురుతో కాకుండా కొత్త చీపురుతో శుభ్రం చేయండి. ఇలా చేయడం ఇంట్లో సానుకూల శక్తితో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. కొత్త ఇంట్లో పాతది లేదా విరిగిన చీపురును ఎప్పుడూ ఉపయోగించవద్దు.
చీపుడు ఏ రోజు కొనడం శుభప్రదం అంటే: గురువారం రోజున కొత్త చీపురు కొనడం శుభప్రదం. అది కూడా కృష్ణ పక్షంలోని గురవారం చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.