IRCTC Tour: తెలుగువారు సమ్మర్ హాలీడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తక్కువ ధరకే వైష్ణవి దేవి సహా నార్త్ ఇండియా చుట్టేయండి..
పరీక్షలు అయిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లో సుదీర్గమైన వేసవి సెలవులు రానున్నాయి. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు తమ ఫ్యామిలీతో , స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళడానికి అది కూడా లాంగ్ టూర్ ప్లాన్ చేస్తారు. ప్రెండ్లీ బడ్జెట్ లో ఉన్న ప్యాకేజీలపై దృష్టి పెడతారు. ఈ నేపధ్యంలో IRCTC తెలుగువారి కోసం ఒక స్పెషల్ నార్త్ ఇండియా టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ లో పుణ్యం పురుషార్ధం కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు అందమైన ప్రకృతిలో కూడా పర్యటించవచ్చు. ఏపీలో మొదలై తెలంగాణ మీదుగా సాగే ఉత్తర భారత దేశ యాత్ర ప్యాకేజీ డీటైల్స్ మీ కోసం

వేసవి సెలవులు వస్తే చాలు ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలను, ప్రకృతికి దగ్గరగా గడపాలని చాలా మంది కోరుకుంటారు. అయితే తమ బడ్జెట్ కు తగ్గటుగా టూర్ సాగాలని ఆలోచించే వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఓ ప్యాకీజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలోఉత్తర భారత దేశంలోని పలు దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేవీలు కల్పిస్తోంది. “భారత గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ లో సాగే ఈ యాత్ర గురుకృప యాత్ర” పేరుతో సాగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లు సాగనున్న ఈ ప్యాకేజీలో ఆనంద్‌పుర్ సాహిబ్, నైనా దేవి, శ్రీ మాత వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్ సందర్శించవచ్చు. ప్రస్తుతం ఏప్రిల్ 23వ తేదీ నుంచి అందుబాటులో ఉన్న టూర్ సాగే విధానం టికెట్ ధరలు వివరాల్లోకి వెళ్తే..
ప్రయాణం ఎలా సాగుతుందంటే
మొదటి రోజు: ఉదయం 8 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ స్టార్ట్ అయ్యి.. గుంటూరు నుంచి తెలంగాణలోని నల్లగొండ, సికింద్రాబాద్, కాజీపేట పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ మీదుగా సాగుతుంది. ఈ ప్రాంతాల్లో పర్యాటకులు ట్రైన్ ఎక్కవచ్చు. దిగవచ్చు.
రెండో రాజు: సెకండ్ డే కూడా మొత్తం ట్రైన్ లో ప్రయాణం సాగుతుంది. బల్హర్షా, వార్ధా, నాగ్‌పూర్ మీదుగా ప్రయాణిస్తారు.
మూడో రోజు: ఉదయం హరిద్వార్‌కు చేరుకుంటారు. ఇక్కడ హోటల్లో చెకిన్ అయ్యి ఫ్రెషప్ అయ్యి.. టిఫిన్ తిని మానసా దేవి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం గంగా హారతి వీక్షిస్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.
నాలుగో రోజు: ఉదయం గంగా నదిలో స్నానం చేస్తారు. టిఫిన్ తిని హోటల్ చెక్ అవుట్ అయి.. రిషికేష్ బయలుదేరుతారు. ఇక్కడ రామ్ ఝులా, లక్ష్మణ్ ఝులా ఆలయాలు దర్శించుకుంటారు అనంతరం రిషికేష్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఇక్కడ నుంచి ఆనంద్‌పూర్ సాహిబ్ కి ప్రయాణం అవుతారు.
ఐదో రోజు: సాయంత్రానికి ఆనంద్‌పూర్ సాహిబ్ చేరుకుంటారు. ఇక్కడ ఫ్రెషప్ అప్ అయ్యి గురుద్వార్ చూసి తర్వాత నైనా దేవి ఆలయానికి వెళ్ళాలి. అనంతరం అమృత్సర్ బయలుదేరుతారు.
ఆరో రోజు: అమృత్సర్ చేరుకుని గోల్డెన్ టెంపుల్, వాఘా బోర్డర్ చూస్తారు. రాత్రికి అమృత్సర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని వైష్ణోదేవి దర్శనానికి స్టార్ట్ అవుతారు.
ఏడో రోజు: కత్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత హోటల్‌కు వెళ్లి చెక్ ఇన్ అవుతారు. అనంతరం వైష్ణోదేవి దర్శనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు పూర్తీ చేయాలి. ( వైష్ణోదేవిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఖర్చు సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుంది) ఈ రోజు రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
ఎనిమిదో రోజు: మాతా వైష్ణోదేవి కత్రా రైల్వే స్టేషన్ కు చేరుకొని టూర్ ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతారు.
తొమ్మిదో రోజు: ఈ రోజు మొత్తం రైలులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
పదో రోజు: నాగ్‌పూర్, వార్ధా, బల్హర్షా మీదుగా తెలంగాణలో అడుగు పెడతారు. కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట, సికింద్రాబాద్, నల్లగొండ, గుంటూరు, విజయవాడకు ట్రైన్ రాత్రి 11:45 గంటలకు చేరుకుంటుంది. దీంతో టూర్ ముగుస్తుంది.
టికెట్ ధరల వివరల్లోకి వెళ్తే
స్లీపర్ క్లాస్ (ఎకానమీ)లో పెద్దలకు రూ.18,510, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.17,390లు చెల్లించాల్సి ఉంటుంది.
థర్డ్ ఏసీ (స్టాండర్డ్ )లో పెద్దలకు రూ.30,730.. 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు రూ.29,420లు చెల్లించాల్సి ఉంటుంది.
సెకండ్ ఏసీ (కంఫర్ట్ )లో పెద్దలకు రూ.40,685, 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు రూ.39,110లు చెల్లించాల్సి ఉంటుంది.
ప్యాకేజీలో లభించే సదుపాయాలు
ట్రైన్ టికెట్లు (SL, 3AC, 2AC)
హోటల్ లో బస
స్థానికంగా తిరిగేందుకు వాహనం ప్రయాణ భీమా సదుపాయం
పొద్దున్న టీ, టిఫిన్, లంచ్, డిన్నర్
ఈ నెల 23 న అందుబాటులో ఉన్న ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.