Vastu Tips: దంపతుల మధ్య నిత్యం గొడవలా.. అయితే ఈ వాస్తు మార్పులు చేయాల్సిందే..

ఇంటి వాస్తు ఇంట్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అయితే కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందనేది నిపుణులు వాదన...

Vastu Tips: దంపతుల మధ్య నిత్యం గొడవలా.. అయితే ఈ వాస్తు మార్పులు చేయాల్సిందే..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 25, 2022 | 6:13 PM

ఇంటి వాస్తు ఇంట్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అయితే కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందనేది నిపుణులు వాదన. ముఖ్యంగా దాంపత్య జీవితాల్లో కలహాలకు వాస్తు లోపలు కారణంగా మారుతుంటుంది. దంపతుల మధ్య నిత్యం ఏ కారణం లేకున్నా కలహాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి వారు కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా గొడవలకు దూరంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటంటే..

* పడకగదిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా గొడవలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. పడకగదిలో ప్రేమ చిగురించాలంటే చిన్న చిన్న రాళ్లు లేదా స్ఫటికాలను గాజు పాత్రలో పెట్టాలని సూచిస్తున్నారు. వీటితో పాటు రెండు రెడ్‌ కలర్‌ కొవ్వుతులను వెలిగిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. రాళ్లు ఉన్న గాజు పాత్రను పడకగదిలో నైరుతి భాగంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య సఖ్యత పెరిగి, ప్రేమ చిగురుస్తుందని చెబుతున్నారు.

* భార్యభర్తల మధ్య అనవసర తగాదాలు వస్తున్నాయంటే ఇంట్లో ఏదో నెగిటివ్‌ ఎనర్జీ ఉందని అర్థం. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు నిత్యం జరుగుతుంటే ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో చిటికెడు ఉప్పు వేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్‌ ఎనర్జీ దూరమవుతుంది. దంపతుల మధ్య అకారణంగా వచ్చే గొడవలు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

* పడకగదిలో ఉండే అద్దంలో బెడ్‌ ప్రతిబింబం ఎట్టి పరిస్థితుల్లో పడకుండా చూసుకోవాలి. ఇలా పడితే అది దంపతుల మధ్య వివాదాలకు దారి తీస్తుంది. ఉదయం నిద్రలేవగానే మనుషుల ప్రతిబింబం అద్దంలో పడకుండా చూసుకోవాలి. ఒకవేళ బెడ్‌ రూమ్‌లో అద్దం ఈ దిశలో ఉంటే వెంటనే తీసేయాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కొందరు వాస్తు నిపుణుల సూచనల మేరకు అందించడం జరిగింది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గుర్తించగలరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..