Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uthana Ekadashi 2024: రేపే ఉత్థాన ఏకాదశి.. పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. ఎందుకంటే

హిందూ మతంలో ఏకాదశి రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఉత్థాన ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు నాలుగు నెలల తర్వాత యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. కనుక ఉత్థాన ఏకాదశి రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా విష్ణువు అనుగ్రహాన్ని పొంది జీవితంలో సుఖ సంతోషాలను విజయాన్ని పొందగలరు. అయితే ఉపవాసం ఉన్నా లేకుండా ఈ రోజున పొరపాటున కూడా ఎవరైనా సరే కొన్ని పనులు చేయకూడదు. లేదంటే జీవితంలో వచ్చే కష్టాల నుంచి ఎవరూ తప్పించుకోలేరని విశ్వాసం

Uthana Ekadashi 2024: రేపే ఉత్థాన ఏకాదశి.. పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. ఎందుకంటే
Ekadashi 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 11, 2024 | 4:45 PM

కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఉత్థాన ఏకాదశి హిందూ మతంలో ముఖ్యమైన పండుగ. ఈ రోజున విష్ణువు నాలుగు నెలల తర్వాత యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ రోజున చేసే పూజలు, ఉపవాసాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయవద్దు. లేకపోతే జీవితంలో అనేక రకాల కష్టాలు ఏర్పడవచ్చు. ఉత్థాన ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణువు, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజున తులసి మొక్కను పూజించడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. నియమాలను అనుసరిస్తూ విష్ణుమూర్తిని పూజించడం వల్ల పాపాలు నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి 11 నవంబర్ 2024 సాయంత్రం 6.46 గంటలకు ప్రారంభమవుతుంది. ఏకాదశి తిధి నవంబర్ 12, 2024 సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం దేవుత్తని ఏకాదశి ఉపవాసం నవంబర్ 12వ తేదీ మంగళవారం నాడు ఆచరించాల్సి ఉంటుంది.

ఉత్థాన ఏకాదశి రోజున పొరపాటున కూడా ఎవరైనా సరే కొన్ని పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులు చేయడం వల్ల జీవితంలో అనేక కష్టాలు.. ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు కోల్పోతారు. కనుక ఈ ఉత్థాన ఏకాదశి రోజున ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. తద్వారా జీవితంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు.

ఇవి కూడా చదవండి

ఉత్థాన ఏకాదశి రోజున పొరపాటున కూడా పనులు చేయకండి

  1. ఆహార తినే విషయంలో జాగ్రత్త: ఉత్థాన ఏకాదశి రోజున విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం చేస్తారు. అందుచేత ఆహారం తీసుకోరాదు. పొరపాటున ఏమైనా తింటే ఉపవాస నియమాన్ని ఉల్లంగించినట్లే..
  2. మాంసం, మద్యం వినియోగం: మాంసం, మద్యంతో పాటు ఇతర తామసిక ఆహార పదార్థాల వినియోగం నిషేధించబడింది. ఉపవాసం ఉన్నా లేకుండా ఇలాంటివి తినడం పాప కర్మ అని నమ్మకం.
  3. అబద్ధం చెప్పడం: అబద్ధం చెప్పడం పాప కర్మ.. ఇలా అబద్దాలు చెప్పడం వలన భగవంతుడికి కోపం వస్తుంది. ఈ రోజు నిజం మాట్లాడటం చాలా ముఖ్యం. ఎవరికీ అబద్ధాలు చెప్పకండి.
  4. దొంగతనం: దొంగతనం పెద్ద పాపం. ఇది జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది.
  5. ఒకరిని బాధపెట్టడం: ఎవరినైనా బాధపెట్టడం వల్ల మనస్సు కలత చెందుతుంది. భగవంతుని అనుగ్రహాన్ని దూరం చేస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రేమతో, కరుణతో మెలగాలి.
  6. కోపం తెచ్చుకోవడం: కోపగించుకోవడం వల్ల మనసు కలత చెందుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ రోజు ప్రశాంతంగా ఉండి విష్ణువుని పూజించాలి.
  7. తప్పుడు ఆరోపణలు చేయడం: ఎవరి పైన అయినా తప్పుడు ఆరోపణలు చేయడం పెద్ద పాపం. ఇది వ్యక్తి గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలకు విఘాతం.
  8. పరుషంగా మాట్లాడం: ఎవరితోనైనా పరుషంగా మాట్లాడం వలన మనస్సు కలవరపెడుతుంది. బంధలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కనుక ఈ రోజు ఎవరిని పరుషమైన పదాలతో నినదించ వద్దు.
  9. అనైతిక చర్యలు చేయడం: అనైతిక చర్యలు చేయడం పాపం .. జీవితంలో అనేక సమస్యలకు దారి తీస్తుంది.
  10. సోమరితనం: సోమరితనం అనేది జీవితంలో అతి పెద్ద చెడు అలవాటు. సోమరి తనం ఉన్నవారు జీవితంలో ఎన్నడూ విజయం సాధించలేడు. ఈ రోజున ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమై ఉండాలి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.