Viral Video: మార్కెట్లోకి నయా మోసగాళ్ళు.. మహిమలు చూపిస్తామంటున్న మహిళామణులు

ఈ మధ్య ఇలా మహిమలు చూపిస్తామంటూ కొత్త కొత్త వేషాల్లో మార్కెట్లోకి వస్తున్న మహిళా మణులు ఎంతో మంది తయారవుతున్నారు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అమ్మగారి చేతిలో కూడా మహిమలు ఉన్నాయంటూ ఇప్పటికే పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

Viral Video: మార్కెట్లోకి నయా మోసగాళ్ళు.. మహిమలు చూపిస్తామంటున్న మహిళామణులు
Viral Video
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Surya Kala

Updated on: Nov 11, 2024 | 4:19 PM

హైదరాబాద్ (11 నవంబర్, 2024): వినేవాడు ఉండాలే గానీ ఏమైనా చెప్తారు.. ఎంతైనా మోసం చేస్తారు. ముందు నుంచి మనకు ఏదైనా గుడ్డిగా నమ్మేసే అలవాటు ఎలాగో ఉంది. అదే కొందరికి వరంలా మారుతుంది. మన అవసరాన్ని అవకాశంగా మలుచుకుని బురిడీ కొట్టించే వాళ్ళు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. అలాంటిదే ఈ సంఘటన కూడా. మహిమలు చూపిస్తానంటూ మాయలు చేసేవాళ్ళు కొందరైతే.. ఆరోగ్యం బాగుచేస్తామని, లక్ష్మీదేవి మీ తలుపు తట్టేలా చేస్తామని అమాయక జనాలని మోసం చేసేవాళ్ళు మరికొందరు. నోట్లో నుంచి లింగాలు తీస్తాం.. చేతి నుండి విభూది రాలుస్తాం అని కూడా కొందరు మాయలు చేయడం.. అది చూసి మనం నమ్మి మోసపోయిన ఘటనలు గతంలో చాలా సార్లే జరిగాయి. ఇక్కడ కూడా అచ్చం అలాగే ఓ మహిళ మహిమలు చూపిస్తానని చెబుతున్న విషయం కొత్తగా వెలుగులోకి వచ్చింది.

ఒక మహిళ ఒక మూసి ఉంచిన పెద్ద పాత్రకు చుట్టూ కొన్ని దండల్లా కట్టింది. ఆపై మహిమ చూపిస్తానంటూ ఆ పాత్రను పట్టుకొని వేగంగా చుట్టూ తిరుగుతుంది. చాలా సేపు అలా తిరిగిన తర్వాత అలిసిపోయి ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. వెంటనే అక్కడ ఉన్న మరికొందరు మహిళలు దగ్గరగా వచ్చి ఆమెను పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఆ మహిళ ఏం చేస్తుంది? ఏం చెప్పి అక్కడి జనాలని నమ్మించింది అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. తాను ఆ పాత్ర చుట్టూ తిరిగి ఏం నిరూపించడానికి అలా చేసిందో కూడా ఎవరికీ అంతుపట్టడం లేదు. పైగా ఇది ఎక్కడ జరిగిందనే దానిపై కూడా పూర్తి స్పష్టత లేదు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన కొందరు నెటిజన్లు ఇలాంటి మోసగాళ్లు ఈ ప్రపంచంలో చాలానే మంది ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అందుకే అంటారు నమ్మేవారు ఉండాలి గానీ ఏదో మాయమాటలు చెప్పి మోసం చేసేవాళ్ళకు కొదవ లేదు అని.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..