కార్తీక మాసంలో ఉసిరి దీపాలు, ఉసిరి చెట్టు కింద భోజనాలు.. ఉసిరికి ప్రాధాన్యత వెనుక ఆరోగ్య రహస్యం ఏమిటంటే..

హిందూ సంప్రదాయంలో మొక్కలను, పశుపక్ష్యాదులను దేవుళ్ళుగా భావించి పూజిస్తారు. ఆరోగ్యానికీ పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతా మూర్తులుగా భావించి కొలుస్తారు. అందుకనే అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రోజు కార్తీక మాసంలో ఉసిరి దీపం, ఉసిరి తినడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసుకుందాం..

కార్తీక మాసంలో ఉసిరి దీపాలు, ఉసిరి చెట్టు కింద భోజనాలు.. ఉసిరికి ప్రాధాన్యత వెనుక ఆరోగ్య రహస్యం ఏమిటంటే..
Usiri Impotance
Follow us
Surya Kala

|

Updated on: Nov 11, 2024 | 3:00 PM

కార్తీక మాసం తెలుగు వారికీ ఆధ్యాత్మిక మాసం.. శివకేశవులను అత్యంత భక్తిశ్రద్దలతో పూజించే మాసం.. అంతేకాదు కార్తీక మాసం అనగానే నదీ స్నానం, దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, ఉసిరి దీపం వంటి అనేక నియమాలు గుర్తుకొస్తాయి. అయితే ఈ నెలలో ఉసిరి చెట్టు నీడలో భోజనం, ఉసిరి దీపం, ఉసిరి తినాలనే నియమం, ఉసిరి చెట్టు నీడలో దీపం పెట్టాలనే నియమం కూడా ఏర్పాటు చేశారు. తులసి తో సమానంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు పూజలను అందుకుంటుంది. క్షీరాబ్ది ద్వాదశినాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజిస్తారు.

ఉసిరి జననంపై పురాణ కథనం

క్షీరసాగరమథనం లో జన్మించిన అమృతం కోసం దేవదానవుల మధ్య ఆ అమృత భాండం కోసం జరిగిన పెనుగులాటలో కొన్ని అమృతపు చుక్కలు భూమి పడ్డాయని.. అవి ఉసిరి చెట్టుగా మారిందని ఓ నమ్మకం. అందుకనే ఉసిరిలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎందుకంటే ఉసిరిలో ఆరు రుచులలో ఒక ఉప్పు తప్ప మిగలిన అంటే మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కషాయం(వగరు), లవణం(ఉప్పదనం), కటువు(కారం), తిక్తం(చేదు) ఈ ఐదు రుచుల సంగమం. ముఖ్యంగా ఉసిరిలో ఆమ్ల గుణం అంటే పులుపు ఎక్కువగా కనిపిస్తుంది.. కనుక దీనిని ఆమ్లా లేదా ఆమలకము అని పిలుస్తారు కూడా.

కార్తీక మాసంలో ఉసిరికి ఎందుకు ప్రాధాన్యత అంటే

కార్తీక మాసంలోనే ఉసిరికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఆరోగ్య రహస్యం దాగి ఉందని తెలుస్తోంది. ఈ నెలల నుంచి శీతాకాలం మొదలు అవుతుంది. దీంతో సీజనల్ వ్యాధులతో పాటు దగ్గు, జలుబు వంటివి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ నెలలో ఉసిరిని తినడం.. లేదా ఉసిరి చెట్టు నీడన ఉండడం వలన ఈ దోషాలు నివారింపబడతాయి. సకల మానవాళిని రక్షిస్తుందని.. వృద్దాప్యాన్ని దరిచేరనివ్వని ఔషద మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చరకసంహిత పేర్కొంది. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే.. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యానికి  సిరి ఉసిరి..

ఈ సీజన్ లో ఉసిరి కాయలు బాగా వస్తాయి. ఉసిరి ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. కనుక ఈ మాసంలో ఉసిరిని ఏదోక రూపంలో తినాలనే నియమం పెట్టారు. అంతేకాదు పూర్వకాలంలో ఉసిరి చెట్టుని ఇంటి పెరడులో పెంచుకునేవారు. ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా ఉంటాయని పెద్దలు చెబుతారు. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి మంచిదని పెద్దల నమ్మకం.

కార్తీక మాసంలో తినాలనే నియమం ఎందుకంటే

అందుకే కార్తీక మాసం యావత్తూ ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి. ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున “ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః” అంటూ తులసితో పాటు విష్ణుమూర్తిని పూజిస్తారు. ఉసిరిని సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా భావిస్తారు. అందుకనే కార్తీకంలో ఉసిరి కాయలు, కొమ్మలు, చెట్టు సమీపంలో ఉండేలా అనేక నియమాలను ఆచరిస్తారు. ఉసిరిని సేవిస్తారు. ఉసిరిలోని విటమిన్‌ సి ఈ మాసంలో వచ్చే కఫ సంబంధమైన జబ్బులను నివారిస్తే, అందులోని పీచు, ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధ సమస్యలను తీరుస్తాయి. జీర్ణశక్తిని కాపాడుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. శరీరంలో సమతుల్యం ఏర్పడే చూస్తుంది. ఇక ఉసిరి నుంచి వీచే చెట్టు గాలికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు, పూజలు, ఉసిరికి ప్రదక్షిణలు, వన భోజనాలు అంటూ ఉసిరి చెట్టు నీడలో ఎక్కువసేపు ఉండే విధంగా నియమాలను ఏర్పాటు చేశారు పెద్దలు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
పుష్ప 2 ట్రైలర్ గ్రాండ్ లాంచ్‏కు టైమ్ ఫిక్స్..
పుష్ప 2 ట్రైలర్ గ్రాండ్ లాంచ్‏కు టైమ్ ఫిక్స్..
క్లాస్‌గా తయారై సూట్ కేసుతో జారుకునేవారికి దేత్తడే..!
క్లాస్‌గా తయారై సూట్ కేసుతో జారుకునేవారికి దేత్తడే..!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం
పీఎం ఇంటర్న్‌షిప్‌ కు అప్లయ్ చేశారా ?? రూ.66 వేలు ఇస్తారు..
పీఎం ఇంటర్న్‌షిప్‌ కు అప్లయ్ చేశారా ?? రూ.66 వేలు ఇస్తారు..
ఫీజు కట్టాలి.. లైసెన్స్ తీసుకోవాలి.. వాట్సాప్ అడ్మిన్లకు షాక్
ఫీజు కట్టాలి.. లైసెన్స్ తీసుకోవాలి.. వాట్సాప్ అడ్మిన్లకు షాక్