Srisailam: శ్రీశైలంలో ముగిసిన ఉగాది మహోత్సవాలు.. నిజారూప అలంకారంలో భ్రమరాంబికా దేవి దర్శనం

ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నిజరూప అలంకార రూపంలో ఆశీనులై భ్రమరాంబికాదేవి అమ్మవారికి అశ్వవాహనాధీసులైన శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్పూరహారతులిచ్చారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు భాజాభజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు ఆలయ ప్రకరోత్సవం గావించారు.

Srisailam: శ్రీశైలంలో ముగిసిన ఉగాది మహోత్సవాలు.. నిజారూప అలంకారంలో భ్రమరాంబికా దేవి దర్శనం
Srisailam
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Apr 11, 2024 | 10:06 AM

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ శైలంలో ఐదు రోజుల పాటు జరిగిన ఉగాది మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా ఈ రోజు నిజారూప అలంకార రూపంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది.  ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నిజారుప అలంకార రూపంలో ఆశీనులైన భ్రమరాంబికాదేవి అమ్మవారికి అశ్వవాహనాధీసులైన శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కర్పూరహారతులిచ్చారు.

అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు భాజాభజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు ఆలయ ప్రకరోత్సవం గావించారు. ఆలయ ప్రదక్షిణలో ఉత్సవం ముందు భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటితో శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు పరిసామాప్తి అయ్యాయి. ఉగాది సందర్భంగా కన్నడ భక్తులు భారీ సంఖ్యలో మల్లన్నను దర్శించుకున్నారు. అమ్మవారికి సారెను సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..