మోమోస్ తయారుచేయడానికి సహాయకుడు కావాలి.. నెల జీతం చూసి ఉద్యోగస్తుల ఫన్నీ కామెంట్స్
చాలా మంది ఉద్యోగులు తమ ప్రతిభకు తగిన జీతం లేదని.. ఇప్పుడు ఇస్తున్న జీతం చాలా తక్కువగా ఉందని భావించేవారున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం అదృష్ట వంతుడు.. అతను అతి త్వరలో దేశీ మోమోస్ షాప్‌లో చేరబోతున్నాడు. మోమోస్ చేయడం కూడా అదృష్టమా అని మీరు అనుకుంటున్నారా.. అవును ఓ మోమో షాప్‌కి హెల్పర్ కావాలి. ఈ ఉద్యోగాన్ని చేసే వ్యక్తికి మంచి జీతం చెల్లించడానికి సిద్ధంగా ఆ షాప్ యజమాని ఉన్నాడు. అయితే ఆ హెల్పర్ కి ఇచ్చే నెల జీతం గురించి తెలిసిన తర్వాత ఎవరైనా షాక్ తినాల్సిందే.
కాలేజీ పూర్తయ్యాక వీలైనంత త్వరగా ఉద్యోగం సంపాదించి మంచి జీతం పొందాలని అందరూ కోరుకుంటారు. అయితే అసలు ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడే జీతంలో నిజమెంతో తెలుస్తుంది. చాలా మంది ఉద్యోగులు తమ ప్రతిభకు తగిన జీతం లేదని.. ఇప్పుడు ఇస్తున్న జీతం చాలా తక్కువగా ఉందని భావించేవారున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం అదృష్ట వంతుడు.. అతను అతి త్వరలో దేశీ మోమోస్ షాప్‌లో చేరబోతున్నాడు. మోమోస్ చేయడం కూడా అదృష్టమా అని మీరు అనుకుంటున్నారా.. అవును ఓ మోమో షాప్‌కి హెల్పర్ కావాలి. ఈ ఉద్యోగాన్ని చేసే వ్యక్తికి మంచి జీతం చెల్లించడానికి సిద్ధంగా ఆ షాప్ యజమాని ఉన్నాడు. అయితే ఆ హెల్పర్ కి ఇచ్చే నెల జీతం గురించి తెలిసిన తర్వాత ఎవరైనా షాక్ తినాల్సిందే.
సోషల్ మీడియా X (గతంలో ట్విట్టర్) ఖాతా వినియోగదారు అమృతా సింగ్ దేశీ మోమో షాక్ కు చెందిన ప్రకటనను పంచుకున్నారు. ఇది ప్రజలను విస్మయానికి గురిచేసింది. కొందరు ఎగిరి గంతేస్తారు కూడా.. వాస్తవానికి మోమో షాప్‌కు సహాయకుడు కావాలి.. అతనికి భారీ జీతం ఆఫర్ చేశాడు షాప్ యజమాని. ఎంపికైన వ్యక్తికి నెలకు రూ.25,000 ఇవ్వనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
అమృత క్యాప్షన్‌లో హే ఇది ఏమిటి? ఈ మోమో షాప్ భారతదేశంలోని సగటు కళాశాలలో పని చేస్తున్న సిబ్బంది జీతాల కంటే మెరుగైన ప్యాకేజీలను అందిస్తోంది. అని పేర్కొంది. చాలా మంది వినియోగదారులు ఈ ప్రకటనను చూసిన తర్వాత తమ భావాలను పంచుకోవడం ప్రారంభించారు.
ఇంటర్నెట్‌లో కొత్త చర్చను ప్రారంభించిన మోమో షాప్ ప్రకటన
Damn this local momo shop is offering a better package than the average college in India these days pic.twitter.com/ectNX0mc18
— Amrita Singh (@puttuboy25) April 8, 2024
ఒక వినియోగదారు ఫన్నీ గా వ్యాఖ్యానించారు.. నేను దరఖాస్తు చేయబోతున్నాను .. ఎంత చదివినా అంత జీతం పొందలేకపోతున్నాను. మరొకరు మాట్లాడుతూ నేను రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాను. మొదటి వేతనం రూ.10 వేలు. ఈ యాడ్ చూస్తుంటే మోమో షాప్ నుండే కెరీర్ ను ప్రారంభించి ఉండాల్సిందనిపిస్తోంది. మా ప్రాంతంలో ప్లంబర్లు కూడా నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నారని మరో వినియోగదారు రాశారు. టీసీఎస్ కంటే మెరుగైన ఆఫర్లు ఇస్తోందని మరో యూజర్ చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..