AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. పది రోజుల్లో కోట్ల రూపాయల విరాళాలు..

ఏడుకొండలపై కొలువైన వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి.. తమ మొక్కులు చెల్లించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమల తిరుపతి క్షేత్రానికి చేరుకుంటారు. వడ్డీకాసుల వాడికి భక్తులు భారీ కానుకలను సమర్పించుకుంటున్నారు. వివిధ రూపాయల్లో భక్తులు ఇచ్చే కానుకలతో శ్రీ వెంకటేశ్వర స్వామి తన ఆస్తుల విలువను పెంచుకుంటున్నాడు. వెంకన్న ఆదాయం పెరిగిపోతోంది. గత 10 రోజులుగా వెంకన్నకు రూ.30 కోట్ల మేర విరాళం అందింది. వివరాల్లోకి వెళ్తే..

Tirumala: తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. పది రోజుల్లో కోట్ల రూపాయల విరాళాలు..
Tirumala
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Mar 29, 2025 | 9:36 AM

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. అపర కుబేరుడు. భక్తులు ఇచ్చే కానుకలతో అంతకంతకు పెరుగుతున్న ఆదాయంతో వెంకన్న ఆస్తుల విలువ అమాంతంగా పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో విరాళాల వెల్లువ శ్రీవారి రూ కోట్ల లో ఆదాయంగా వస్తోంది. ఈ నెల 17 నుంచి 27 వరకు పది రోజుల్లో శ్రీవారికి భక్తులు విరాళంగా సమర్పించిన విరాళాల విలువ రూ. 30 కోట్లకు పైగానే ఉంది. ఈనెల 18న టిటిడి నిర్వహిస్తున్న ఎస్వీ అన్నదానం, ఎస్ వి ప్రాణదానం, ఎస్వీ విద్యాదానం విభాగాలకు రూ. 1.23 కోట్ల విరాళం అందింది. కర్ణాటకలోని బళ్లారి కి చెందిన శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఈ మేరకు డీడీలను తిరుమల లో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి దాతలు అందజేశారు. ఇందులో రూ. 1,01,11,111 ఎస్వీ అన్నదానం ట్రస్ట్ కు, రూ.11,11,111 విరాళాన్ని ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు, రూ. 11,11,111 విరాళాన్ని ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ కు దాతలు అందజేశారు. దాతలను టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అభినందించి సత్కరించారు.

అన్నప్రసాద వితరణకు సీఎం ఫ్యామిలీ విరాళం.

21న తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానంలో అన్న ప్రసాదాలు వడ్డించిన ఏపీ సీఎం కుటుంబసభ్యులు రూ. 44 లక్షల విరాళాన్ని అందజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న నిత్య అన్నదానం కార్యక్రమం పై భక్తులతో మాట్లాడిన సీఎం భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. తమ మనువడు నారా దేవాన్ష్‌ 11 వ పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్న ప్రసాదానికి అయ్యే రూ.44లక్షల ఖర్చును ఆన్‌లైన్‌ ద్వారా విరాళంగా అందించారు.

మార్చి 21 న: శ్రీ బాలజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి హైదరాబాద్ కు చెందిన భక్తులు రూ.కోటి విరాళం అందించారు. హైదరాబాద్ కు చెందిన ఎనర్ టెక్ కామ్ నెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ఏవీ.రమణరాజు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.1,00,01,116 విరాళంగా అందించారు. టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీ ని అందజేశారు. దాతను టీటీడీ చైర్మన్, అదనపు ఈవోలు అభినందించారు.

ఇవి కూడా చదవండి

మార్చి 24 న: టీటీడీకి రూ.16.67లక్షలు విరాళం అందింది. విజయవాడకు చెందిన ఎన్. శ్రీరామ్ ప్రసాద్ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116లు విరాళంగా అందించారు. కాకినాడకు చెందిన ఎలైట్ ఇన్స్ట్రుమెంట్స్ మేనేజింగ్ పార్టనర్ సూర్య నారాయణ రెడ్డి రూ.6,66,000 టీటీడీకి విరాళంగా అందించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీ లను అందజేశారు. దాతలను టీటీడీ చైర్మన్ అభినందించారు.

మార్చి 24 న: టీటీడీకి రూ.10.11 లక్షలు విరాళం అందింది. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన గౌరవ్ ఐరెన్ అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయస్ ట్రస్టుకు రూ.10,11,111/- విరాళంగా అందించారు. టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్ నాయుడుకు విరాళం డీడీ ని అందజేశారు.

మార్చి 25 న: టీటీడీకి భక్తుడు కెమెరా విరాళం ఇచ్చారు. నెల్లూరుకు చెందిన వంశీరామ్ బిల్డర్స్ అధినేత వంశీరామ్ సుబ్బారెడ్డి రూ.8.84 లక్షలు విలువైన కెనాన్ డిజిటల్ మిర్రర్ లెస్ కెమెరా, లెన్సులను టీటీడీకి విరాళంగా అందించారు. దాత తరపున టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవోకు కెమెరా, లెన్సులను అందజేశారు.

మార్చి 26 న: టీటీడీకి రూ.1.01 కోట్లు విరాళం అందింది. రాజమహేంద్ర వరం కు చెందిన తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు సరోజిని దేవి దంపతులు శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.1,01,11,111 విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు విరాళం డీడీ ని అందజేశారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్, అదనపు ఈవో అభినందించారు.

మార్చి 27 న : టీటీడీకి రూ.2.45 కోట్లు విరాళం అందింది. టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు రూ.2.45 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకు చెందిన జినేశ్వర్ ఇన్ ఫ్రా వెంచర్స్ సంస్థ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించగా, శ్రీలంకకు చెందిన ఒక దాత అన్న ప్రసాదం ట్రస్టుకు మరో రూ.కోటి విరాళంగా అందించారు. నోయిడా కు చెందిన పసిఫిక్ బీపీవో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు విరాళం డీడీలను అందజేశారు.

ఇలా భక్తులు విరాళంగా ఇచ్చిన కొన్ని వివరాలు ఇలా ఉండగా టీటీడీ డోనర్ సెల్ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం పలు స్కీములకు గాను టీటీడీకి విరాళాల రూపంలో రూ. 29.90 కోట్లు వచ్చినట్లు స్పష్టమవుతుంది.

ఈ నెల 17 నుంచి 27 వరకు టీటీడీ ట్రస్ట్ లకు వచ్చిన విరాళాలను పరిశీలిస్తే

  1. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ కు రూ. 11,67,15,870,
  2. శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ 8,14,90,958,
  3. శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని స్కీం కు రూ 4,88,50,391,
  4. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ కు రూ. 1,15,83,653,
  5. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ 1,14,36,016,
  6. శ్రీ వెంకటేశ్వర విద్యా దాన ట్రస్ట్ కు రూ.1,65,85,417
  7. బర్డ్ ఆసుపత్రి ట్రస్ట్ కు రూ. 54,92,050
  8. శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్సు ట్రస్ట్ కు రూ. 37,48,526,
  9. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ, 29,60,968,
  10. స్విమ్స్ ఆసుపత్రి ట్రస్ట్ కు రూ. 2,05,326,
  11. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్ కు రూ.2,101 దాతలు విరాళంగా ఇచ్చారు.

ఇలా టిటిడి నిర్వహిస్తున్న 10 ట్రస్టులకు గాను పది రోజుల్లో మొత్తం రూ 29,90,71,336 లు తిరుమలేషుడి ఖాతాకు విరాళాల రూపంలో జమ అయ్యింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..