TTD Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. సర్వదర్శనం టికెట్లు రేపు విడుదల.. వివరాలివే

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. స్వామివారిని దర్శించుకునేందుకు సర్వదర్శన టోకెన్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల..

TTD Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. సర్వదర్శనం టికెట్లు రేపు విడుదల.. వివరాలివే
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 23, 2021 | 8:35 AM

Tirumala Sarva Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. స్వామివారిని దర్శించుకునేందుకు సర్వదర్శన టోకెన్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల కోటా టికెట్లను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. రోజుకు 20 వేల చొప్పున 6 లక్షల 20 వేల టికెట్లను విడుదల చేస్తామని పేర్కొన్నారు. 24న ఉదయం 9 గంటల నుంచి ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

జనవరి నెలకు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు 5 వేలు ఆఫ్‌లైన్‌లో.. మరో 5 వేలు ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 25వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. రోజుకి 5 వేల చొప్పున లక్షా 55 వేల టికెట్లను విడుదల చేయనుంది. ఈ నెల 31వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు జారీ చేయనుంది. ఆఫ్‌లైన్‌లో ప్రతినిత్యం తిరుపతిలో ఐదు వేల టికెట్లు ఇవ్వనుంది.

తిరుమల వసతికి సంబంధించి ఈ నెల 27న ఉదయం 9 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు. కాగా జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో భక్తులు పొందవచ్చు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన, వసతిని బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

వీటితోపాటు డిసెంబర్ 23న ఉదయం 9 గంట‌ల‌కు జనవరి 1, 2, 13 నుండి 22 మరియు 26వ తేదీలలో 5500 వర్చువల్ సేవా దర్శన టికెట్లు విడుదల చేస్తారు.

ఇవి కూడా చదవండి: Pralay Missile: చైనా గుండెల్లో వణుకుపుట్టిస్తున్న ప్రళయ్‌.. భారత క్షిపణి పరీక్ష విజయవంతం..

Viral Video: గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు.. 30 అడుగుల ఎత్తులో వేలాడాడు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే