AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి తెరపైకి హనుమంతుడి జన్మస్థలం వివాదం.. హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీటీడీ..

Tirumala Tirupati Devasthanam: హనుమంతుడి జన్మస్థలం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుమలే హనుమంతుడి జన్మస్థలం..

మరోసారి తెరపైకి హనుమంతుడి జన్మస్థలం వివాదం.. హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీటీడీ..
Shiva Prajapati
|

Updated on: May 09, 2021 | 8:42 AM

Share

Tirumala Tirupati Devasthanam: హనుమంతుడి జన్మస్థలం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుమలే హనుమంతుడి జన్మస్థలం అంటూ టీటీడీ చేసిన వాదనకు కర్ణాటకలోని హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అభ్యంతరం చెబుతూ లేఖ రాయగా.. టీటీడీ ఆ లేఖకు కౌంటర్ ఇచ్చింది. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని ఉద్ఘాటించింది. ఈ మేరకు లేఖ రాసింది టీటీడీ బోర్డు. ‘హనుమంతుడి జన్మస్థలం కనుగొనాలనే సంకల్పంతో టీటీడీ.. నిష్ణాతులైన పండితులతో పరిషత్ ఏర్పాటు చేసింది. ఆ పండిత పరిషత్ నాలుగు నెలలు శ్రమతో పౌరాణిక, వాజ్మయ, శాసన, భౌగోళిక ఆధారాలను పరిశోధించింది. తమ పరిశోధనలో తిరుమలలోని అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని నిర్ధారించి నివేదిక సమర్పించింది. ఈ విషయంపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని అందరినీ కోరాం. ఆంజనేయుని జన్మస్థలంపై ఆధారాలతో ప్రకటించడం టీటీడీ చరిత్రలో తొలిసారి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరినీ ఆక్షేపించకుండా మంచి భాషతో ఈ విషయాన్ని ప్రకటించాం. హనుమంతుడి జన్మస్థలంపై మేము చేసిన కృషిని ప్రశంసిస్తూ దేశవ్యాప్తంగా భక్తుల నుండి ప్రశంసలు అందాయి.’

‘ఇటీవలే కర్ణాటకలోని రిజిస్టర్ సంస్థ అయిన హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు రాసిన లేఖ తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. లేఖలో రాసిన భాష, మోపిన అభాండాలు మీలాంటి వారి స్థాయికి తగినరీతిలో లేవు. హనుమంతుడి జన్మస్థలంపై మూర్ఖపు ఆలోచనలు మానుకోవాలని మాకు చెప్పడం పై మీ గౌరవం తగ్గుతుంది. మా నివేదిక పొందపరిచిన విషయాలు ఎలా నిరాధారమో మీరు మే 20వ తేదీ లోపు నిరూపించి మాకు నివేదిక సమర్పించండి. మీరు నివేదిక సమర్పిస్తే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తాం. రామ జన్మభూమి వివాదం సమసి అయోధ్యలో రామాలయం నిర్మించడానికి 70 ఏళ్లు పట్టింది. హనుమంతుడి జన్మస్థలం విషయంలో అలా జరగకూడదని హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని నిర్ధారించి పుస్తకం ముద్రించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దైవకార్యాన్ని దూషించినందుకు మీరు టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.’ అంటూ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లేఖ రాసింది.

Also read:

Putta Madhu: పుట్టామధును విచారిస్తున్న పోలీసులు.. కీలక విషయాలను రాబడుతున్న టాస్క్ఫోర్స్ పోలీసులు

హాట్ వాటర్‌తో కొవిడ్ తగ్గుతుందా..! ఇది నిజమేనా..? కేంద్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..