Tirumala: నూతన పరకామణి భవనంలో హుండీ లెక్కింపు.. శ్రీవారి దర్శననానికి 20 గంటలు..
కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకల లెక్కింపు.. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది. నూతన పరకామణి భవనంలో హుండీ కానుకలను టీటీడీ అధికారులు లెక్కించనున్నారు. ఫిబ్రవరి 5 న పూజా..
కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకల లెక్కింపు.. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది. నూతన పరకామణి భవనంలో హుండీ కానుకలను టీటీడీ అధికారులు లెక్కించనున్నారు. ఫిబ్రవరి 5 న పూజా కార్యక్రమాల అనంతరం హుండీ కానుకల లెక్కింపు ప్రారంభమవుతుంది. సిబ్బంది సమస్యలు, దర్శన సమయం ఆదా కోసం నూతన పరకామణి భవనాన్ని నిర్మించారు. పరకామణి భవన నిర్మాణానికి బెంగుళూరుకు చెందిన మురళీకృష్ణ రూ.23 కోట్లు విరాళం ఇచ్చారు. 2022 సెప్టెంబర్ 28 న పరకామణి భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అభివృద్ధి పనులు పూర్తి చేసి హుండీ కానుకల లెక్కింపునకు భవనాన్ని టీటీడీ సిద్ధం చేసింది.
మరోవైపు.. శ్రీవారి సర్వ దర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా సోమవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 17 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో స్వామివారి దర్శనం లభించనుంది. ఈ మేరకు టీటీడీ అధికారులు వివరాలు వెల్లడించారు. ఆదివారం శ్రీవారిని 78,639 మంది భక్తులు దర్శించుకోగా.. రూ.4.16 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. కాగా.. తిరుమలలో సాయంత్రం వర్షం కురవడంతో చలి తీవ్రత పెరిగింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..