AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: స్త్రీలు ఈ విషయాలను జీవితాంతం రహస్యంగా ఉంచుతారు.. దేవుడు కూడా కనిపెట్టలేడు..!

ఆచార్య చాణక్యుడు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలలో ప్రజలకు మార్గనిర్దేశం చేసిన గొప్ప పండితుడు. ఒక వ్యక్తి తన జీవితంలో చాణక్యుడు చెప్పిన సూచనలు పాటించడం ద్వారా సమాజంలో..

Chanakya Niti: స్త్రీలు ఈ విషయాలను జీవితాంతం రహస్యంగా ఉంచుతారు.. దేవుడు కూడా కనిపెట్టలేడు..!
Chanakya Neeti
Shiva Prajapati
|

Updated on: Jan 31, 2023 | 1:42 PM

Share

ఆచార్య చాణక్యుడు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలలో ప్రజలకు మార్గనిర్దేశం చేసిన గొప్ప పండితుడు. ఒక వ్యక్తి తన జీవితంలో చాణక్యుడు చెప్పిన సూచనలు పాటించడం ద్వారా సమాజంలో తనదైన గుర్తింపును పొందుతాడు. అయితే, వైవాహిక జీవితానికి సంబంధించి కూడా చాణక్యుడు తన నీతిశాస్త్రం గ్రంధంలో అనేక కీలక విషయాలు పేర్కొన్నారు. భార్య, భర్తలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ఆచార్య చాణక్య ప్రకారం.. చాలామంది మహిళలు తమ వైవాహిక జీవితంలో అనేక రహస్యాలను దాచి ఉంచుతారు. ఒక స్త్రీ అనుకుంటే.. ఆమె తన జీవితాంతం ఆ విషయాలను రహస్యంగా ఉంచుతుంది. మరి ఆ విషయాలు ఏంటివి? చాణక్య ఏం చెప్పారు? ఇప్పుడు తెలుసుకుందాం.

గడిచిన జీవితం..

వ్యక్తికి వివాహానికి ముందు ఒక జీవితం, వివాహం తరువాత మరో జీవితం ఉంటుంది. స్త్రీలకు కూడా అంతే. తన జీవితంలోకి భర్త రాక ముందు ఒక గతాన్ని కలిగి ఉంటారు. క్లియర్‌కట్‌గా చెప్పాలంటే.. చాలా మంది స్త్రీలు పెళ్లికి ముందు ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడుతారు. అయితే, ఆ ప్రేమను పెళ్లి తరువాత దాచి పెడతారు. ఈ విషయాన్ని తమ భర్తకు చెప్పరు. గతాన్ని మరిచిపోవడం, రహస్యంగా ఉంచడం వల.. ప్రస్తుత జీవితానికి ఎలాంటి ఆటంకం ఉండదని వారు విశ్వసిస్తారు. పెళ్లి తరువాత తన కుటుంబం శ్రేయస్సు కోసం స్త్రీ తన గతాన్ని దాచిపెడుతుంది.

తన కుటుంబ విషయాలను దాచి ఉంచుతుంది..

పెళ్లి అయినప్పటికీ.. ఎంతైనా కూతురు కూతురే కదా! కనిపెంచిన తల్లిదండ్రులపై మమకారం, ప్రేమను కలిగి ఉంటుంది. అయితే, పెళ్లి తరువాత మెట్టినింట్లో, భర్త అడుగుజాడల్లో, వారి జీవితానికి అనుగుణంగా గడపవలసి వస్తుంది. అయితే, స్త్రీలు తమ కుటుంబంలోని చెడు విషయాలను బయటకు చెప్పరు. ముఖ్యంగా తన తల్లిదండ్రుల ఇంటికి సంబంధించిన విషయాలను భర్తకు, వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ విషయాలను వారికి తెలిస్తే.. అవహేళనలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇంటి పొదుపు..

ఇంటిని నడిపించే అంశంలో స్త్రీలను మించి ఎవరూ ఉండరు. మహిళలు ఇంటి ఖర్చులను తగ్గించి పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి సహాయం చేయడానికి పొదుపు చేస్తారు. చాలా మంది మహిళలు ఇంటి ఖర్చుల నుంచి పొదుపు చేసి, భర్తకు తెలియకుండా దాచి పెడతారు. ఈ డబ్బులు అత్యసవర పరిస్థితుల్లో వినియోగిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..