Shani Remedies: పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు.. శని దేవుడి ఆగ్రహానికి గురవుతారు..!

శని గ్రహాన్ని మంగళకరమైనది, అశుభకరమైనది పరిగణిస్తారు. ఎందుకంటే.. శని దేవుడు కొన్నిసార్లు మంచి చేస్తాడు.. మరికొన్నిసార్లు హానీ తలపెడతాడు. అంటే మీపై శనీశ్వరుడు ఆగ్రహంతో ఉన్నట్లయితే..

Shani Remedies: పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు.. శని దేవుడి ఆగ్రహానికి గురవుతారు..!
Shani Dev Worship
Follow us

|

Updated on: Jan 31, 2023 | 1:33 PM

శని గ్రహాన్ని మంగళకరమైనది, అశుభకరమైనది పరిగణిస్తారు. ఎందుకంటే.. శని దేవుడు కొన్నిసార్లు మంచి చేస్తాడు.. మరికొన్నిసార్లు హానీ తలపెడతాడు. అంటే మీపై శనీశ్వరుడు ఆగ్రహంతో ఉన్నట్లయితే.. అంతా చెడే జరుగుతుంది. అదే మంచి దృష్టిని కలిగి ఉంటే మాత్రం అంతా శుభమే జరుగుతుంది. అందుకే శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు చేసే పనులే.. శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి, ఆగ్రహానికి గురవడానికి కారణం అవుతాయి. శనీశ్వరుడి చెడు దృష్టి పడితే.. దాని ప్రభావం 19 సంవత్సరాలు ఉంటుంది. మరి శనిదేవుడి ఆగ్రహానికి గురికాకుండా ఏం చేయాలి? అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? వంటి కీలక వివరాలు మీకోసం..

రాశిలో బలహీనంగా ఉంటే..

మీ జాతకంలో శని సరికాని స్థానంలో ఉన్నట్లయితే.. అంతా నష్టమే జరుగుతుంది. శని, సూర్యుడు కలిసి ఉన్నా కూడా ఆర్థికంగా చితికిపోతారు. అలాగే, పండితుల సలహా తీసుకోకుండా రత్నాలు ధరిస్తే కూడా నష్టపోతారు. అందుకే ఏదైనా రంగురాయి, రత్నాన్ని ధరించే ముందు పండితుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి.

సాత్వికాహారం, స్వచ్ఛమైన మనసు కలిగి ఉండాలి..

శని మీ జాతకంలో 3 గానీ, 4వ పాదంలో గానీ ఇండాలి. అలా ఉంటే.. అంతా అదృష్టమే వరిస్తుంది. శని ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, స్వంత నక్షత్ర రాశిలో ఉన్నప్పుడు కూడా ప్రయోజనం కలుగుతుంది. అలాగే, ఒక వ్యక్తి స్వచ్ఛమైన మనసుతో ఉండటం కూడా శనీశ్వరుడి అనుగ్రహానికి కారణం అవుతుంది. సాత్వికాహారం తీసుకోవడం, స్వచ్ఛమైన మనసుతో ఉండటం శుభాన్ని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

రావి చెట్టు కింద ఇలా చేయాలి..

శనివారాల్లో రావి చెట్టు క్రింద నాలుగు ముఖాల ఆవాల దీపం వెలిగించి, కనీసం మూడుసార్లు ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా శనీశ్వరుడిని అనుగ్రహం పొందవచ్చు. ఇలా చేయడం వలన మీ జీవితంలో అంతా శుభమే జరుగుతుంది. అయితే, ఈ పక్రియ చేసేటప్పుడు శనిదేవుని మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పేద వారికి డబ్బు దానం చేయాలి. వ్యాపారంలో విజయం సాధించాలనుకుంటే, శనివారం సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీటిని సమర్పించాలి. సాయంత్రం అదే చెట్టు కింద పెద్ద దీపం వెలిగించాలి. తర్వాత అక్కడ శని చాలీసా పఠించాలి. పేదవారికి భోజనం పెట్టాలి. శనివారం నాడు ఇలా మంచి పనులు చేయడం వల్ల వ్యాపారం సహా, అన్నింటిలోనూ శుభం జరుగుతుంది.

శనివారం నాడు మాంసం, మద్యం ముట్టొద్దు..

మీరు డబ్బు ఆదా చేయాలనుకుంటే, ఆవనూనె, నల్ల నువ్వులను దానం చేయాలి. ఒక నాణేన్ని నల్లటి గుడ్డలో కట్టి ఇంట్లోని చీకటి ప్రదేశంలో ఉంచాలి. అలాగే, శనివారం నాడు మాంసాహారం, మద్యం సేవించకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఆదా అవుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..