Minister Kishan Reddy: రాజీనామాలు చేయాల్సిన అవసరంలేదు.. జనమే ఇంటికి పంపిస్తారు.. బీఆర్ఎస్ నేతల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గెలిచినప్పటి నుంచి ఒక్క రోజు కూడా సభలో అడుగుపెట్టకుండా చేశారని.. అంతేకాకుండా, అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేసి సభకు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు.

Minister Kishan Reddy: రాజీనామాలు చేయాల్సిన అవసరంలేదు.. జనమే ఇంటికి పంపిస్తారు.. బీఆర్ఎస్ నేతల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..
Minister Kishan Reddy on CM KCR
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 31, 2023 | 11:12 AM

బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధానికి, రాష్ట్రపతికి, గవర్నర్‌కు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని అన్నారు కిషన్ రెడ్డి. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గెలిచినప్పటి నుంచి ఒక్క రోజు కూడా సభలో అడుగుపెట్టకుండా చేశారని.. అంతేకాకుండా, అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేసి సభకు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అంత గొప్ప మహానుభావులు మాకు రాజకీయాల గురించి, హక్కుల గురించి నీతులు చెబుతున్నారని ఎద్దేవ చేశారు. ఇప్పుడేమో ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తామని అంటున్నారు. మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మేం కోరుకోవడం లేదు.. కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో జనమే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని ఫైరయ్యారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వంకు గవర్నర్ మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. చివరికి ఈ వివాదాన్ని హైకోర్టుకు తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్‌ తీరుపై బీఆర్ఎస్‌ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అటు పార్లమెంట్ అఖిలపక్షంలోనూ బీఆర్‌ఎస్‌ పార్టీ తన వాదన బలంగా వినిపించే ప్రయత్నం చేసింది.

రెండు వైపులా ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానం కావడంతో చివరకు కోర్టు దాకా వెళ్లారు. తమిళిసైపై న్యాయపరమైన యుద్ధానికి దిగిన కేసీఆర్ ప్రభుత్వం.. కొన్ని గంటల వ్యవధిలోనే అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం