Tirumala Hundi Record: శ్రీవారి హుండీ ఆదాయం వరుసగా తొమ్మిదో నెల రికార్డ్.. ఎన్ని కోట్లంటే!

టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ సర్వ దర్శనం టికెట్లను జారీ చేస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయాలను కూడా మార్చింది. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Tirumala Hundi Record: శ్రీవారి హుండీ ఆదాయం వరుసగా తొమ్మిదో నెల రికార్డ్.. ఎన్ని కోట్లంటే!
Ttd Hundi Income
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 02, 2022 | 1:09 PM

కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది నెలలుగా శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. వరసగా తొమ్మిదో నెలలో శ్రీవారి ఆదాయం వంద కోట్ల మార్క్‌ దాటేసింది. నవంబర్‌లో హుండీ ద్వారా శ్రీవారికి 127.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గత నెలలో చూస్తే సగటున.. ప్రతి రోజూ 70 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో భారీగా హుండీ ఆదాయం వచ్చింది. శ్రీవారి హుండీ ఆదాయం గత మార్చి నుంచి వరుసగా 100 కోట్ల మార్క్‌ని దాటేస్తూ వస్తోంది.

కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత తిరమలకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. వారం, సెలవులతో సంబంధం లేకుండా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ ఏడాది మార్చి నెల నుంచి భక్తుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతూనే ఉంది. తిరుమల కొండ ఏడుకొండల వాడి నామస్మరణతో మారుమోగుతుంది. గడిచిన ఎనిమిది నెలల హుండీ ఆదాయాన్ని పరిశీలించగా రూ.1,161 .74 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ యేడాది హుండీ ఆదాయం రూ.1600 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2019-20లో వచ్చిన రూ. 1,313 కోట్ల ఆదాయమే అత్యధికమని వివరించారు. ఆగస్టు నెలలో అత్యధికంగా రూ. 140.34 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

ఇకపోతే, టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ సర్వ దర్శనం టికెట్లను జారీ చేస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయాలను కూడా మార్చింది. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.