Kitchen for Elephant: ఎలిఫెంట్‌ రెస్టారెంట్‌.. పసందైన విందుకోసం ఇక్కడికి రండి..!

ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షల మందికి పైగా చూశారు. ఈ ఫుడ్ మేకర్స్ ఇక్కడ ఎంత శ్రద్ధగా పని చేస్తున్నారో వీడియోలో గమనించవచ్చు.

Kitchen for Elephant: ఎలిఫెంట్‌ రెస్టారెంట్‌.. పసందైన విందుకోసం ఇక్కడికి రండి..!
Elephant Kitchen
Follow us

|

Updated on: Dec 02, 2022 | 12:47 PM

మనం ఏనుగులను అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం..వాటిని తాకటానికి కూడా ప్రయత్నిస్తుంటాం. వాటికి ఆహారం అందిస్తుంటాం. అడవుల్లో ఉండే భారీ జంతువులలో ఏనుగులు కూడా ఒకటి. అయితే ఏనుగులు చూడటానికి ఎంతో భారీ ఆకారంతో ఉన్నప్పటికీ.. వాటి మనసు మాత్రం ఎంతో సున్నితమని కొన్ని ఘటనల ద్వారా అందరికీ అర్థమవుతుంది. అయితే, చాలా చోట్ల ఏనుగులు మనుషులు చెప్పినట్టుగానే నడుచుకోవటం చేస్తుంటాయి. అయితే, అలాంటి ఏనుగులకు మావటి వాళ్లు ఆహారం ఎలా అందిస్తారు.. అడవుల్లో కావాల్సినంత ఆహారం తినే ఏనుగులకు సరైన భోజనం ఎలా అందుతుంది. అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా..? ఇలాంటి సందేహమే వీళ్లకు కూడా వచ్చిందో ఏమోగానీ, ఏనుగుల కోసం ప్రత్యేకించి ఓ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేశారు. ఏనుగులకు పసందైన విందును అందుబాటులో పెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

తమిళనాడులో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ కు ఇప్పుడు గజరాజుల యజమానులు క్యూ కట్టారు. సురేందర్ మెహ్రా అనే భారతీయ అటవీ అధికారి మదుమలైలోని ఈ తెప్పకడు ఏనుగుల కోసం ఓ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేశారు. ఏనుగుల కోసం తయారు చేసే ఆహారం పశువైద్యుని పర్యవేక్షణలో జరుగుతుంది. జొన్న, బియ్యం, ఉప్పు, బెల్లంతో ఇక్కడ పెద్ద ముద్దలు తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షల మందికి పైగా చూశారు. ఈ ఫుడ్ మేకర్స్ ఇక్కడ ఎంత శ్రద్ధగా పని చేస్తున్నారో వీడియోలో గమనించవచ్చు.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ గొలుసు ఎందుకు కట్టారని కొందరు ప్రశ్నించారు. జంతువుల కోసం కేటాయించిన స్థలంలో ఇది సరికాదు అంటూ మరికొందరు కామెంట్‌ చేశారు. స్వేచ్ఛగా తిరుగుతూ తమ ఆహారాన్ని ఆస్వాదించేలా చూడాలని మరికొందరు సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles