Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం.. రెండు నెలల్లో ఇది నాలుగోసారి!

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు ప్రారంభం అయిన తర్వాత ప్రమాదం జరగడం ఇది నాలుగోసారి. కాగా, పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ...

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం.. రెండు నెలల్లో ఇది నాలుగోసారి!
Vande Bharat Express
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 02, 2022 | 10:37 AM

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాతక్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మరోమారు ప్రమాదం జరిగింది. ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గాంధీనగర్-ముంబై వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. గురువారం సాయత్రం గుజరాత్‌లోని ఉద్వాడ మరియు వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రైలు ముందు భాగానికి చిన్నపాటి డెంట్ ఏర్పడింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు ప్రారంభం అయిన తర్వాత ప్రమాదం జరగడం ఇది నాలుగోసారి. కాగా, పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ… ఉద్వాడా, వాపి మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 87 సమీపంలో సాయంత్రం 6.23 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ముందు వైపున ఒక చిన్న డెంట్ ఉంది. ఆ తర్వాత డెంట్ ఫిక్స్ చేయబడింది. కొంత సేపటి తర్వాత సాయంత్రం 6.35 గంటలకు రైలు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించిందని ఆయన తెలిపారు.

నవంబర్ 8న గుజరాత్‌లోని ఆనంద్ సమీపంలో సెమీ-హై-స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 54 ఏళ్ల మహిళ మరణించింది. అహ్మదాబాద్‌లో నివాసముంటున్న బీట్రైస్ ఆర్చిబాల్డ్ పీటర్ ఆనంద్‌లోని బంధువులను కలవడానికి వెళుతోంది. ఈ సమయంలో ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ దాటుతుండగా సాయంత్రం 4.37 గంటలకు ప్రమాదం జరిగింది. రైలు గాంధీనగర్ క్యాపిటల్ నుండి ముంబై సెంట్రల్‌కు వెళుతోందని, అది ఆనంద్ రైల్వే స్టేషన్‌లో ఆగదని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పెరిగిన ప్రజాదరణ, ప్రయాణానికి డిమాండ్ పెరిగింది.

అక్టోబర్ 29న గుజరాత్‌లోని వల్సాద్‌లోని అతుల్ స్టేషన్ సమీపంలో రైలు ఆవును ఢీకొనడంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం జరిగింది. దీంతో రైలు ముందు భాగం దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి