AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండండి..

ఈ సీజన్‌లో చాలా మంది జలుబు, ఫ్లూ సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చలికాలంలో ఫిట్‌గా ఉండేందుకు ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవచ్చు.

Health Tips: ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండండి..
Winter Tips
Jyothi Gadda
|

Updated on: Dec 02, 2022 | 8:27 AM

Share

చలికాలంలో మనసు ఎప్పుడూ వేడి వేడిగా తినాలని కోరుకుంటుంది. వేడి వేడి బోండా, చిప్స్‌, వేయించిన వంటకాలతో మనల్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే చలికాలంలో నోటి రుచిని పెంచేందుకు ఏదైనా తింటే ఆరోగ్యం మాత్రం దెబ్బతినడం ఖాయం. చలికాలంలో ఆహారం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అయితే ఈ సీజన్‌లో చల్లని ఆహార పదార్థాల వినియోగం చాలా హానికరం. కొంతమందికి చలికాలంలోనూ, వర్షాకాలంలోనూ శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌తో సహా చల్లని ఆహారపదార్థాలు తినడం అలవాటు. ఈ సీజన్‌లో చాలా మంది జలుబు, ఫ్లూ సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చలికాలంలో ఫిట్‌గా ఉండేందుకు ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవచ్చు. అయితే చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో చలికాలంలో ఎలాంటి పదార్థాలు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

చలికాలంలో ఈ వస్తువులను తీసుకోవద్దు.. శీతాకాలంలో ప్యాక్ చేసిన జ్యూస్‌లను తీసుకోవద్దు. ఇందులో చక్కెర సాంద్రత ఎక్కువగా ఉంటుంది. తద్వారా మీ శరీరంలోని తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది.

పాల ఉత్పత్తులు … చలికాలంలో పాల ఉత్పత్తుల వినియోగానికి దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల మీకు ఇన్ఫెక్షన్, ఛాతీలో కఫంతో గురకకు కారణం కావచ్చు. అందుకే చలికాలంలో షేక్స్, స్మూతీస్ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల దగ్గు సమస్య కూడా వస్తుంది.

ఇవి కూడా చదవండి

రెడ్ మీట్.. శీతాకాలంలో రెడ్ మీట్ తినడం నిషేధించబడింది. ఎందుకంటే ఈ మాంసంలో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. దీని వల్ల గొంతులో కఫం వచ్చే అవకాశం ఉంది. అందుకే చలికాలంలో రెడ్ మీట్ తినడం మానేయాలి.

సలాడ్.. చల్లని సలాడ్, పచ్చి ఆహారం తినడం వల్ల శీతాకాలంలో జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది. చలికాలంలో సలాడ్ కూడా తినడం మానేయాలి.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ న్యూస్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..