December 2022 Horoscope: ఈ రాశుల వారికి డిసెంబర్‌ నెల కీలకం కానుంది.. అద్భుతాలు జరగనున్నాయి…

ఉద్యోగంలో కొత్త, మెరుగైన అవకాశాలు లభిస్తాయి. అప్పులు, ఖర్చుల నుండి ఉపశమనం ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

December 2022 Horoscope: ఈ రాశుల వారికి డిసెంబర్‌ నెల కీలకం కానుంది.. అద్భుతాలు జరగనున్నాయి...
Horoscope
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 01, 2022 | 2:03 PM

2022 సంవత్సరం ముగింపు నెలలో అడుగుపెట్టాం..డిసెంబర్ 2022 సంవత్సరం చివరి నెల.. జ్యోతిశాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి డిసెంబర్ నెల చాలా శుభప్రదంగా ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే, మరికొన్ని రాశుల వారు మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో, మేషం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీనం రాశి వారు ఆర్థిక రంగంలో చాలా ప్రయోజనాలను పొందుతారు. సంవత్సరంలో చివరి నెల అన్ని రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మేషరాశి – డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ పనిలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. డబ్బు, వృత్తి, వ్యాపారంలో మరిన్ని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం కొద్దిగా ప్రభావితమవుతుంది. ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలు రావచ్చు. భాగస్వామితో సంబంధాలు కూడా చెడిపోవచ్చు.

వృషభం – వృషభ రాశి వారికి డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంటుంది. మీరు మీ కెరీర్‌లో కొన్ని మార్పులను చూడవచ్చు. ఆరోగ్యాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. కోపానికి దూరంగా ఉండాలి. ఇది మీ కెరీర్‌లో కూడా సమస్యలను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మిథునం – పనుల్లో ఆటంకాలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొంత మానసిక ఒత్తిడి ఉండవచ్చు, కానీ మీరు మీ సవాళ్ల నుండి బయటపడగలుగుతారు. ఈ మాసం ఆర్థిక రంగంలో కూడా విజయాన్ని అందిస్తుంది. విదేశీ మార్గాల ద్వారా కూడా డబ్బు రావచ్చు.

కర్కాటక రాశి – కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారం, ఆర్థిక రంగంలో లాభాలను పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. కానీ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం దెబ్బతినవచ్చు. గాయాలు, ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో వాహనం నడిపే క్రమంలో మరింత జాగ్రత్తగా ఉండండి.

సింహ రాశి – డిసెంబర్ నెలలో మీ కోరికలు కొన్ని నెరవేరుతాయి. కుటుంబ జీవితంలో సంతోషం, సంతృప్తి ఉంటుంది. ఒడిదుడుకుల మధ్య, మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సామరస్యాన్ని కొనసాగించగలుగుతారు. ఆర్థికంగా కూడా ఈ నెల మీకు మంచి ఫలితాలను అందిస్తుంది.

కన్యారాశి – డిసెంబర్ నెల కన్య రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. మీరు ఈ నెలలో మీ స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. సరదాగా ఉంటుంది. మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కానీ మీ ఖర్చులు పెరుగుతాయి. రుణ సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

తులారాశి – తులారాశి వారికి ఈ డిసెంబరులో మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. ఆర్థిక పరంగా ఈ నెల బాగుంటుంది. మీరు విదేశీ ప్రయత్నం ఫలిస్తుంది. అనుకున్న పనుల్లో మీరు విజయం సాధిస్తారు. అయినప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. మంచి స్నేహితునితో వాగ్వాదం రావచ్చు. అనువుగానీ చోట సంయమనం పాటించాలి. ఈ రాశి వారికి డిసెంబర్ నెల అనేక విధాలుగా మేలు చేస్తుంది.

వృశ్చికం – మీ పనులన్నీ పూర్తవుతాయి. మీ పనుల్లో వచ్చే అడ్డంకులు కూడా తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక రంగంలో కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ, మీరు మీ సవాళ్లను అధిగమించగలుగుతారు.

ధనుస్సు రాశి- విదేశాలకు వెళ్లాలనే మీ కల ఈ నెలలో నెరవేరే అవకాశం ఉంది. ఈ నెలలో కొన్ని చిన్న ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఈ నెల ఆదాయ వనరుల నుండి తగినంత డబ్బు వస్తూనే ఉంటుంది. ఇతర విషయాలలో పెట్టుబడి పెట్టడానికి సమయం చాలా మంచిది.

మకర రాశి – డిసెంబర్ నెల మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పరంగా, ఈ నెల మధ్యస్తంగా ఉంటుంది. ఆదాయాలు సాధారణంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఈ నెలలో మీ ఆలోచనల్లో లోతు ఉంటుంది. మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో చేసిన వ్యూహాలు చాలా కాలం పాటు ప్రభావవంతంగా ఉంటాయి.

కుంభం – కుంభ రాశి వారికి డిసెంబర్ నెల అనుకూలంగా ఉంటుంది. మీ శ్రామిక శక్తి బలంగా ఉంటుంది. మీ ధైర్యం, శక్తి పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో సకాలంలో విజయం సాధించగలుగుతారు. డబ్బుకు లోటు ఉండదు. స్నేహితులు, బంధువుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.

మీనరాశి – మీన రాశి వారికి డిసెంబర్ నెల అద్భుతంగా ఉంటుంది. జీవితంలో కొనసాగుతున్న సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ మాసం ఆర్థిక రంగంలో కూడా విజయాన్ని అందిస్తుంది. విదేశీ మార్గాల ద్వారా కూడా డబ్బు రావచ్చు. ఉద్యోగంలో కొత్త, మెరుగైన అవకాశాలు లభిస్తాయి. అప్పులు, ఖర్చుల నుండి ఉపశమనం ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్