Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: కష్టార్జితం ఎక్కడికీ పోదంటే ఇదే మరీ..! కోటి రూపాయల నగలు చేజారిపోయి కూడా మళ్లీ చెంతకొచ్చింది.. ఎలాగంటే..

ఘజియాబాద్‌లోని లాల్ కువాన్ ప్రాంతంలో క్యాబ్‌ని గుర్తించారు. వెంటనే క్యాబ్‌ను అడ్డగించిన పోలీసులు లోపలున్న నగల బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు. తెరిచి చూడగా..

Delhi: కష్టార్జితం ఎక్కడికీ పోదంటే ఇదే మరీ..! కోటి రూపాయల నగలు చేజారిపోయి కూడా మళ్లీ చెంతకొచ్చింది.. ఎలాగంటే..
Jewellery Bag
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 01, 2022 | 9:09 PM

ఢిల్లీలో జరుగుతున్న తన కుమార్తె వివాహం కోసం ఓ తండ్రి లండన్‌ నుంచి వచ్చాడు. కూతూరి పెళ్లి కోసం కోటి విలువైన నగలను ఓ సూట్‌కేస్‌ వంటి బ్యాగ్‌లో పెట్టుకుని ఉబర్‌ క్యాబ్‌లో ఇంటికి చేరుకున్నాడు. అయితే, తీరా ఇంటికి వెళ్లి చూడగా అతని బ్యాగ్‌ కనిపించలేదు. దాంతో అతగు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. విస్తృత తనిఖీలు చేపట్టారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఎన్‌ఆర్‌ఐ నిఖిలేష్ కుమార్ సిన్హాకు చెందిన బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

లండన్‌లో నివసిస్తున్న నిఖిలేష్ కుమార్ సిన్హా, గ్రేటర్ నోయిడా వెస్ట్ సమృద్ధి గ్రాండ్ అవెన్యూ ఆమ్రపాలి గ్రీన్ వ్యాలీలో తన కుమార్తె వివాహం కోసం లండన్ నుండి వచ్చారు. బుధవారం తన వస్తువులతో గౌర్ సరోవర్ పోర్టికో హోటల్ గౌర్ సిటీ వన్‌కు చేరుకున్నట్లు నిఖిలేష్ పోలీసులకు తెలిపాడు. పెళ్లికి ఆభరణాలు ఉంచిన బ్యాగ్‌ని ట్యాక్సీలోనే వదిలేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు మొదలుపెట్టారు. క్యాబ్ ఉన్న ప్రదేశాన్ని ఉబర్ గుర్గావ్ కార్యాలయంలో గుర్తించారు.

ఘజియాబాద్‌లోని లాల్ కువాన్ ప్రాంతంలో క్యాబ్‌ని గుర్తించారు. వెంటనే క్యాబ్‌ను అడ్డగించిన పోలీసులు లోపలున్న నగల బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు. తెరిచి చూడగా బ్యాగు నిండా నగలు కనిపించాయి. పోలీసులు టాక్సీ డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అసలు ఆ బ్యాగ్‌ కార్‌లోనే ఉందన్న విషయం కూడా తనకు తెలియదని డ్రైవర్‌ చెప్పుకొచ్చాడు. తన వాహనం లో నగలతో నిండిన బ్యాగ్ ఉందని తనకు తెలియదని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

పొరపాటున ట్యాక్సీలో బ్యాగ్ వదిలేశారని ఎన్ఆర్ఐ పోలీసులకు తెలిపాడు. ఇందులో డ్రైవర్‌ తప్పు లేదని చెప్పాడు.. కొన్ని గంటల్లోనే కోటి విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎన్నారై కుటుంబానికి తిరిగి అప్పగించారు. దీనిపై నిఖిలేష్ కుమార్ సిన్హా గ్రేటర్ నోయిడా పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత త్వరగా బ్యాగ్ దొరుకుతుందని తాను ఊహించలేదన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి