AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: సైకిల్‌కు సిలిండర్‌ కట్టుకుని.. ఓటేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

గుజరాత్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వినూత్నంగా పోలింగ్‌...

Gujarat: సైకిల్‌కు సిలిండర్‌ కట్టుకుని.. ఓటేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Vote With Cylinder
Ganesh Mudavath
|

Updated on: Dec 01, 2022 | 1:26 PM

Share

గుజరాత్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వినూత్నంగా పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఇప్పుడు ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్యాస్‌ సిలిండర్‌ను సైకిల్‌కు కట్టుకొని ఓటు వేయడానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. క్రమం క్రమంగా పెరుగుతూ దాదాపు రూ.1200కు చేరుకుంది. దీంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు కూడా గట్టిగానే ప్రతిస్పందిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగిన ధరలతో సామాన్యుడి నడ్డి విరుగుతోందని మండిపడుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఇదే సరైన సమయం అని భావించిన ఓ ఎమ్మెల్యే ఇలా వెరైటీగా నిరసన చేపట్టారు.

అమ్రేలిలో హస్తం పార్టీ ఎమ్మెల్యే పరేశ్‌ ధనాని.. సైకిల్‌కు సిలిండర్‌ కట్టుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీజీ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయని దానిపై రాశారు. ఇలా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓటర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు.. గుజరాత్‌లో తొలి విడతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 5 న జరుగనుండగా, డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై