AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake CBI officer: మినిస్టర్‌ గంగుల కమలాకర్‌,గాయత్రి రవితో బిగ్‌ డీల్‌.. ఫేక్‌ CBI ఆఫీసర్‌ శ్రీనివాస్‌కేసులో సంచలన విషయాలు..

సీబీఐలో ఉన్న గ్రానైట్‌ కేసును మేనేజ్‌ చేస్తానని.. మంత్రి గంగుల కమలాకర్‌, గాయత్రి రవితో బిగ్‌ డీల్‌ జరిగినట్లు సమాచారం. ఇందుకోసం ఖమ్మంలో మంత్రి గంగుల కమలాకర్‌ , గాయత్రి రవితో..

Fake CBI officer: మినిస్టర్‌ గంగుల కమలాకర్‌,గాయత్రి రవితో బిగ్‌ డీల్‌.. ఫేక్‌ CBI ఆఫీసర్‌ శ్రీనివాస్‌కేసులో సంచలన విషయాలు..
Minister Gangula And Gayatr
Sanjay Kasula
|

Updated on: Dec 01, 2022 | 1:21 PM

Share

తెలంగాణలో ఫాంహౌస్‌ కేసును మించిన మరో బిగ్‌డీల్‌ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఫేక్‌ సీబీఐ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సీబీఐలో ఉన్న గ్రానైట్‌ కేసును మేనేజ్‌ చేస్తానని.. మంత్రి గంగుల కమలాకర్‌, గాయత్రి రవితో బిగ్‌ డీల్‌ జరిగినట్లు సమాచారం. ఇందుకోసం ఖమ్మంలో మంత్రి గంగుల కమలాకర్‌ , గాయత్రి రవితో శ్రీనివాస్‌ ఖమ్మంలో భేటీ అయినట్లు తెలుస్తోంది. పంజాగుట్టలోని ఓ జువెలరీ షాపులో 25 లక్షల గోల్డ్‌గిఫ్టును తీసుకున్న గాయత్రి రవి, శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ గెస్ట్‌హౌస్‌లో ఇచ్చినట్లు సమాచారం. గ్రానైట్‌ కంపెనీ అసోసియేషన్‌ తరఫున ఈ గిఫ్టు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

ఫేక్‌ ఐపీఎస్‌ శ్రీనివాస్‌కేసుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలే వెలుగులోకి వచ్చాయి. సీనియర్‌ ఐపీఎఎస్‌ ఆఫీసరనంటూ శ్రీనివాస్‌రావు భారీ మోసాలకు తెరలేపాడు. పలువురు ప్రముఖులకు సీబీఐ, ఈడీ కేసులను సెటిల్మెంట్‌ చేయిస్తానని పెద్దమొత్తంలో వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

విశాఖజిల్లా చిన్నవాల్తేర్‌ సమీపంలోని కిర్లంపూడికి చెందిన నిందితుడు శ్రీనివాస్‌రావు గత ఐదేళ్లుగా ఢిల్లీలోనే మకాం వేశారు. తమిళనాడు, మధ్యప్రదేశ్‌ భవన్‌లను అడ్డగా చేసుకొని సెటిల్మెంట్లు దందాకు తెరలేపారు. తెలంగాణ, ఆంధ్రా,తమిళనాడు,కర్నాటక, రాష్ట్రాలకు చెందిన రాజకీయనేతలతో శ్రీనివాస్‌ టచ్ లో ఉన్నట్లు సమాచారం. వారికి తనకున్న పలుకుబడితో ఢిల్లీలో పనులు చక్కబెట్టి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

శ్రీనివాస్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు ఉన్నాయి. యూసఫ్‌గూడకు చెందిన మేలపాటి చెంచునాయుడును శ్రీనివాస్‌ మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో వినయ్‌హాండా కుమారుడికి సీబీఐలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డాడు. ఇక మార్గాన వెంకటేశ్వరరావు, రవికి చెందిన 2వేల వాహణాలను ఢిల్లీలో నో ఎంట్రీ స్థలంలో అనుమతించేలా పోలీసులతో మాట్లాడ్తానని పైసలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మొత్తానికి శ్రీనివాస్‌రావు పెద్దమొత్తంలో మోసాలకు పాల్పడట్లు ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ అరెస్టు చేసి , విచారణ చేపట్టడంతో మోసపోయిన పలువురు ప్రముఖుల వివరాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం