Gujarat: కచ్‌-సౌరాష్ట్రలో సత్తా చాటేదెవరు..? గుజరాత్ తొలి దశ ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖులు ఎవరంటే..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ గురువారం జరుగనుంది. తొలిదశ పోలింగ్‌లో 89 అసెంబ్లీ సీట్లలో ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్‌ సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Gujarat: కచ్‌-సౌరాష్ట్రలో సత్తా చాటేదెవరు..? గుజరాత్ తొలి దశ ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖులు ఎవరంటే..
Gujarat Polls 2022
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 30, 2022 | 7:54 PM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ గురువారం జరుగనుంది. తొలిదశ పోలింగ్‌లో 89 అసెంబ్లీ సీట్లలో ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్‌ సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. బీజేపీతో ఎలాగైనా ఏడోసారి గెలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. ఆప్ కూడా అరంగ్రేటం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సమయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రచారంలో అస్త్రంగా వాడుకుంది. మోదీని రావణుడితో పోల్చి ఖర్గే గుజరాతీలను అవమానించారని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 182 స్థానాల గుజరాత్‌ అసెంబ్లీలో మొదటి విడతలో దక్షిణ గుజరాత్‌, కచ్‌-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్‌ జరుగనుంది. మిగతా 93 స్థానాలకు ఐదో తేదీన ఎన్నికలు జరుగుతాయి.

తొలి దశ బరిలో బీజేపీ సీనియర్‌ నేతలు పురుషోత్తమ్‌ సోలంకీ, కువర్జీ బవాలియా, క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా, ఆమ్‌ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ, ఆప్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా సహా 788 మంది అభ్యర్థులు ఉన్నారు. 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. తొలి దశలో మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 2 కోట్ల 39 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

జోరందుకున్న రెండో దశ ప్రచారం..

ఓవైపు గురువారం తొలి దశ పోలింగ్‌ జరుగుతుందడగా .. రెండో దశ ఎన్నికల ప్రచారం కూడా ఊపందుకుంది. సీఎం భూపేంద్ర పటేల్‌ అహ్మాదాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. అసర్వలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జుర్‌ ఖర్గే తీరును తీవ్రంగా తప్పుపట్టారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌. కాంగ్రెస్‌ పార్టీ సంస్కృతికి ఆయన వ్యాఖ్యలు అద్దం పట్టాయన్నారు. గుజరాత్‌లో బీజేపీ అభ్యర్దుల తరపున ఆయన ప్రచారం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఈసారి యాంటీ రాడికల్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ప్రధాని మోదీ , కేంద్రమంత్రి అమిత్‌షా , బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రచార బాధ్యతలపై తమ భుజాలపై వేసుకున్నారు. వారంలో నాలుగు రోజులు గుజరాత్‌ లోనే గడుపుతున్నారు ప్రధాని మోదీ. సారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోకపోతే ఆ ప్రభావం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీపై పడుతుందని భావిస్తున్న బీజేపీ.. తీవ్రంగా పోరాడుతోంది.

ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య ముక్కోణపు పోరు సాగుతోంది. ఇందులో బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా.. దానికి అడ్డుకట్టే వేసేందుకు కాంగ్రెస్, ఆప్ ప్రయత్నిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..