Rare Tokay Gecko Lizard: ఓ దుకాణంలో పోలీసుల తనిఖీలు.. అరుదైన బల్లి స్వాధీనం.. దాని ధర తెలిస్తే మతి పోవాల్సిందే

పక్కా సమాచారం మేరకు పోలీసులు బైసి ప్రాంతంలోని ఒక దుకాణాన్ని తనిఖీ చేశారు. అరుదైన బల్లిని స్వాధీనం చేసుకున్నారు.

Rare Tokay Gecko Lizard: ఓ దుకాణంలో పోలీసుల తనిఖీలు.. అరుదైన బల్లి స్వాధీనం.. దాని ధర తెలిస్తే మతి పోవాల్సిందే
Tokay Gecko Lizard
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 01, 2022 | 12:57 PM

అంతరించిపోతున్న అరుదైన బల్లిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని ఓ మెడికల్ స్టోర్‌లో అరుదైన టోకే గెక్కో బల్లి, మత్తునిచ్చే దగ్గు సిరప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతరించిపోయిన తక్షక్ జాతికి చెందిన బల్లిగా అధికారులు వెల్లడించారు. రికవరీ చేసిన వస్తువుల మార్కెట్‌ విలువ దాదాపు కోటి రూపాయలుగా అధికారులు వెల్లడించారు. స్మగ్లింగ్ కోసం ఉపయోగించిన ట్యాక్సీని ఢిల్లీకి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు బైసి ప్రాంతంలోని ఒక దుకాణాన్ని తనిఖీ చేశారు. అరుదైన బల్లిని స్వాధీనం చేసుకున్నారు.

టోకే గెక్కో బల్లిని పశ్చిమ బెంగాల్‌లోని కరాండిఘి నుంచి బీహార్‌కు తీసుకెళ్లినట్లు ఏరియా ఎస్‌డిపిఓ ఆదిత్య కుమార్ తెలిపారు. ఈ ఘటనలో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తక్షక్‌ను ఉంచిన దుకాణదారుని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఈ స్మగ్లింగ్‌ వ్యవహారంతో సంబంధం ఉన్న మిగతా నేరగాళ్లను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారని పోలీసులు తెలిపారు.

మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్‌ వంటి ఇతరాత్ర మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. ఆగ్నేయాసియా దేశాల్లో తక్షకు మంచి డిమాండ్ ఉంది. తక్షక్ అనేక దేశాలలో అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి