AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: జర్మనీని ఇంటికి పంపిన వివాదాస్పద గోల్.. ఆ నిర్ణయంపై విమర్శలు..

FIFA World Cup: జపాన్ తన చివరి లీగ్ రౌండ్ మ్యాచ్‌లో 2-1తో స్పెయిన్‌ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో జపాన్‌ చేసిన రెండో గోల్‌ను వీఏఆర్‌ నిర్ణయించడంతో అది వివాదంలో చిక్కుకుంది.

Watch Video: జర్మనీని ఇంటికి పంపిన వివాదాస్పద గోల్.. ఆ నిర్ణయంపై విమర్శలు..
Japan Vs Spain Controversy Goal
Venkata Chari
|

Updated on: Dec 02, 2022 | 2:02 PM

Share

ఫిఫా వరల్డ్ కప్ 2022 గ్రూప్ రౌండ్ నుంచి జర్మనీ జట్టు నిష్క్రమించింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో జర్మనీ 4-2తో కోస్టారికాను ఓడించింది. కానీ, ఇప్పటికీ నాకౌట్‌కు చేరుకోలేకపోయింది. ఫిఫాలో స్పెయిన్ ఓటమి చెందినా.. కూడా నాకౌట్ ఆడేలా చేసింది. ఇదే గ్రూప్‌లోని రెండో మ్యాచ్‌లో స్పెయిన్‌ను ఓడించిన జపాన్ ‎ఆశలు అడియాసలు అయ్యాయి. జర్మనీ నిష్క్రమణ తర్వాత సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.

జపాన్ వర్సెస్ స్పెయిన్ మధ్య చాలా ఉత్తేజకరమైన మ్యాచ్ జరిగింది. ఇది జర్మనీ విధిని కూడా నిర్ణయించింది. ఈ మ్యాచ్‌లో జపాన్‌ 2–1తో విజయం సాధించింది. అయితే, రెండో గోల్ విషయంలో వివాదం మొదలైంది. కొందరు అభిమానులు మాత్రం గోల్ ఇవ్వాల్సింది కాదని, సరైన నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

జపాన్ గోల్‌పై వివాదం..

  1. మ్యాచ్ 51వ నిమిషంలో జపాన్ ఆటగాడు తనకా గోల్ చేశాడు. అంతకుముందు మ్యాచ్ 1-1తో సమమైంది.
  2. గోల్‌లోకి వెళ్లే ముందు బంతి టచ్‌లైన్‌లో ఉంది. అక్కడ నుంచి కౌరు మితోమా షాట్ ఆడాడు. బంతిని నేరుగా నెట్‌ ముందుకి తీసుకువచ్చాడు. ఇక్కడ నుంచి తనకా కట్ చేసి బంతిని గోల్‌లో ఉంచాడు.
  3. అయితే, ఆన్-ఫీల్డ్ రిఫరీ గోల్ ఇవ్వలేదు. నిర్ణయాన్ని VAR (వీడియో అసిస్టెంట్ రిఫరీ)కి వదిలేశారు.
  4. మ్యాచ్ రిఫరీ బంతి టచ్‌లైన్ వెలుపలికి వెళ్లిందని, అది ఆట నుంచి బయటపడిందని నమ్మాడు. VAR (వీడియో అసిస్టెంట్ రిఫరీ) ఈ నిర్ణయాన్ని రద్దు చేశాడు.
  5. VAR బంతి గాలిలో ఉందని, దానిలో కొంత భాగం రేఖకు ఎగువన ఉందని విశ్వసించాడు. దీని కారణంగా బంతిని ఆటలో లేనట్లుగా పరిగణించి గోల్ ఇచ్చాడు.
  6. మ్యాచ్ సమయంలో చూపిన కెమెరా యాంగిల్‌లో బంతి పూర్తిగా కనిపించడం వల్ల టచ్‌లైన్ వెలుపల బంతి ఉందని అభిమానులు అంటున్నారు. దీంతో వివాదం మొదలైంది. ఈ గోల్ జర్మనీని ఔట్ చేయడం కూడా వివాదానికి కారణం.