Tiruchanur: ఘనంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు.. కోలాటాలు, నృత్యాల నడుమ వైభవంగా వేడుకలు..
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత ఆ స్థాయిలో జరిగే తిరుచానూరు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా..
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత ఆ స్థాయిలో జరిగే తిరుచానూరు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా నాలుగో రోజు కల్పవృక్ష వాహనంపై అమ్మవారు ఊరేగారు. శ్రీ రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాఢ వీధుల్లో నృత్యాలు, కోలాటాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారికి సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అమ్మవారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు.
కాగా.. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఏటా కార్తీక మాసంలో టీటీడీ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. 9 రోజులపాటు జరగనున్నాయి. వివిధ వాహనాలపై పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంతో ఉత్సవాలను టీటీడీ ఏకాంతంగా నిర్వహించింది. ఈ ఏడాది భక్తుల మధ్య పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం