AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: గురువారం రాశిఫలాలు.. నేడు ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకునే అవకాశం..

రోజులో జరిగే మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో చాలా మంది తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో (నవంబర్ 24వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: గురువారం రాశిఫలాలు.. నేడు ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకునే అవకాశం..
Horoscope
Surya Kala
|

Updated on: Nov 24, 2022 | 6:29 AM

Share

Horoscope Today (24-11-2022):  రోజులో  ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. రోజులో తమకు ఎలా ఉంటుంది.. రోజులో జరిగే మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో చాలా మంది తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో (నవంబర్ 24వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఆశించిన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది.  కీర్తి పెరుగుతుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మొహమాటం వలన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలు పాటించాలి. కీలకమైన పనుల విషయంలో మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక  పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒత్తిడిని జయించి  ముందుకు సాగుతారు. శుభవార్త వింటారు. ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంటుంది.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ పడాల్సి ఉంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మేలు. అనవసర ధన వ్యయం చేసే అవకాశాలున్నాయి. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న సమయానికి పూర్తి  చేస్తారు.   అనవసర ధనవ్యయం చేసే అవకాశం ఉంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధిక పరమైన ఆశించిన ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పెద్దల సహకారంతో వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు అంచనాలను అందుకుంటారు. శుభవార్త వింటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సలహాలతో ముఖ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. మానసిక బలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఒత్తిడిని అధిగమించి కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను అందుకుంటారు. శుభకాలం. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఉత్సాహంగా పనిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను అందుకుంటారు. శుభకాలం. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు బంధుమిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు,. శుభఫలితాలను అందుకుంటారు. కీలక విషయాల్లో బాధ్యతలను నెరవేర్చేదిశగా అడుగులు వేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు అవసరానికి డబ్బులు చేతికి అందుకుంటారు. అధికంగా శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. మానసికంగా దైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.  కాలం అనుకూలంగా ఉంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టే పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. సంతోషాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..