Diwali Puja 2022: దీపావళి లక్ష్మీ పూజా విధానం.. వ్రత నియమాలు.. కావల్సిన సామాగ్రి ఏంటో తెలుసుకుందాం..
దీపావళి సాయంత్రం, సంపద, శ్రేయస్సు కోసం లక్ష్మీ దేవి, గణేశుడిని పూజిస్తారు. లక్ష్మీ పూజ కోసం ఈ సామగ్రి జాబితా రెడీగా పెట్టుకోండి.. పూజకు ఏం కావాలంటే..
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోஉస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు.
అయితే ఈ ఏడాది దీపావళి పండుగను అక్టోబర్ 24న జరుపుకుంటారు. సంతోషం, శ్రేయస్సు కోసం ఈ రోజున లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. సంతోషంగా ఉండే ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుందని, జీవితాంతం భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తుందని నమ్ముతారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆచారాలతో పూజిస్తారు. లక్ష్మీపూజకు ప్రత్యేక సామగ్రి అవసరం. మీరు ఇప్పటివరకు పూజా సామగ్రి ఏం కావాలి.. పూజ ఎలా చేయాలి.. అనే అంశాలను తెలుసుకుందాం..
దీపావళి పూజకు శుభ ముహూర్తం
- కార్తీక అమావాస్య తిథి ప్రారంభం – 24 అక్టోబర్ 2022, 05.27 పీఎం
- కార్తీక అమావాస్య తేదీ ముగుస్తుంది – 25 అక్టోబర్ 2022, 04.18 పీఎం
- లక్ష్మీ పూజ ప్రదోష కాల ముహూర్తం (సాయంత్రం) – అక్టోబర్ 24 సాయంత్రం 07:02 గంటలకు- 08 నుంచి 23 నిమిషాలు
- లక్ష్మీ పూజ నిశిత కాల ముహూర్తం (అర్ధరాత్రి) – 24 అక్టోబర్ 2022 రాత్రి 11:46 నుండి – 25 అక్టోబర్ 2022న మధ్యాహ్నం 12:37 వరకు(గ్రహనం ఉన్నందున స్థానిక సమయంను అనుసరించాలి)
దీపావళి పూజకు అవసరమైన సామాగ్రి జాబితా
- గణేశుడు, లక్ష్మీ దేవి కొత్త విగ్రహం లేదా చిత్ర పటాలు
- లెడ్జర్ ఖాతా నోటు బుక్కు
- లక్ష్మీదేవికి ఒక ఎరుపు పట్టు వస్త్రం, ఒక పసుపు వస్త్రం
- అమ్మవారిని కోర్చోబెట్టేందుకు ఎరుపు వస్త్రం
- విగ్రహం కోసం చెక్క ఆసనం
- ఐదు పెద్ద నూనె దీపాలు
- 25 చిన్న నూనె దీపాలు
- ఒక మట్టి కుండ
- తాజా పూలతో చేసిన కనీసం మూడు దండలు
- బిల్వ ఆకులు, తులసి ఆకులు
- స్వీట్లు, పండ్లు, చెరకు, లావా
- దుర్వా గడ్డి
- హారతి ప్లేట్
- కర్పూరం
ఆర్థిక సమస్యలు తొలగిపోయేందుకు..
లక్ష్మీదేవిని పూజించేటప్పుడు గోమతి చక్రాన్ని మీ పళ్లెంలో ఉంచాలి. ఆ తర్వాత గోమతీ చక్రానికి పూజ చేయాలి.అనంతరం లక్ష్మీ, గణేశుడు, కుభేర యంత్రాలను కూడా పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీపూజ ముగిసిన అనంతరం దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది. మీకు వీలైతే శంఖనాదం కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుందని పండితులు చెబుతారు. అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం