- Telugu News Photo Gallery Business photos Increasing expectations on Auto Expo 2025, Entry of top models of cars, Auto Expo 2025 details in telugu
Auto Expo 2025: ఆటో ఎక్స్‌పో-2025పై పెరుగుతున్న అంచనాలు.. టాప్ మోడల్స్ కార్ల ఎంట్రీ
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ, భారతీయ కార్ల తయారీదారుల నుంచి కొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అనేక బ్రాండ్‌లు తమ లాంచ్‌లను ధ్రువీకరించాయి. కియా, మహీంద్రా, ఎంజీ కంపెనీలు ఆటో ఎక్స్‌పో 2025లో మొదటిసారిగా తమ ఉత్పత్తుల్లో కొన్నింటిని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించే కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Jan 12, 2025 | 7:30 AM

మహీంద్రా కంపెనీ ఇటీవల ప్రకటించిన ఈవీ ఎస్‌యూవీ కూపే ఎక్స్ఈవీ 9ఈ మోడల్‌ను కూడా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే మహీంద్రా ఈ మోడల్ బుకింగ్, డెలివరీ టైమ్‌లైన్‌లతో పాటు దాని టాప్-స్పెక్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఈ ధరలు రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటాయి, అయితే ఢిల్లీ, ముంబై, పూణే వంటి ఫేజ్ 1 నగరాల్లో టెస్ట్ డ్రైవ్‌లు త్వరలో ప్రారంభిస్తారు. ఈ కారు ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది. 59 కేడబ్ల్యూహెచ్, 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలతో 600 కిమీ కంటే ఎక్కువ పరిధి అందిస్తుందని కంపెనీ చెబుతుంది.

కియా కంపెనీకు సంబంధించిన కియా సిరోస్ కారు ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శనకు రానుంది. డిజైన్, ఫీచర్ లోడెడ్ క్యాబిన్ కియా సిరోస్ ప్రత్యేకతగా నిలవనుంది. ఈ ప్రీమియం సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ధరలు ఫిబ్రవరి 1, 2025న ప్రకటిస్తారు. సిరోస్ కారు ముందు, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్ సెటప్, అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలతో పాటు పీఎస్ 1 లీటర్ టర్బో-పెట్రోల్, 116 పీఎస్ 1.5 లీటర్ డీజిల్‌తో సహా రెండు ఇంజన్ ఎంపికలతో అందిస్తున్నారు.

ఎంజీ కంపెనీ ఎం9 ప్రీమియం ఎలక్ట్రిక్ ఎంపీవీను ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శిస్తుంది. మొదట్లో 2023 ఆటో ఎక్స్‌పోలో మిఫా 9గా ప్రదర్శించారు. ఈ కారు ఎంజీ కొత్త 'సెలెక్ట్' డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. ఈ కారు సుమారు రూ. 1 కోటి (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఎం9 ప్రీమియమ్ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. ఇందులో వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ సీట్లు, వెనుక ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు 90 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో అందిస్తుంటే ఈ కారు క్లెయిమ్ చేయబడిన 565 కిమీ పరిధిని అందిస్తుంది.

మహీంద్రా బీఈ-6 మోడల్‌ను కూడా ఆటో ఎక్స్‌పో 2025లో ఎక్స్ఈవీ 9ఈతో పాటుగా ప్రదర్శించనుంచి ఎక్స్ఈవీ 9ఈతో పోలిస్తే ఇది చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపే. అయితే ఇదే విధమైన బ్యాటరీ ప్యాక్స్‌లో మాత్రం ఎలాంటి తేడా లేదు. బీఈ-6 ధరలు రూ. 18.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 26.90 లక్షల మధ్య ఉంటుంది. ఫీచర్ల వారీగా ఈ కారు ఇది డ్యూయల్ 10.25 అంగుళాల డిస్‌ప్లేలు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, మల్టీ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌లు, లెవెల్-2 ఏడీఏఎస్‌లతో ఆకట్టుకుంటుంది.

ఎంజీ భారతదేశంలో ఆల్-ఎలక్ట్రిక్ సైబర్‌స్టర్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రారంభించనుంది . కార్‌మేకర్ ఇటీవలే ఇండియా స్పెక్ మోడల్ కోసం పవర్‌ట్రైన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఇందులో 510 పీఎస్ డ్యూయల్ మోటార్ సెటప్‌తో జత చేసిన 77 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. డబ్ల్యూటీపీ క్లెయిమ్ చేసిన 444 కిమీ పరిధిని అందిస్తుంది. అలాగే ఈ కారు 3.2 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. సైబర్‌స్టర్ ధరలు రూ. 75 లక్షల నుంచి రూ. 80 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.




