- Telugu News Photo Gallery Business photos Thrilling Ather 2025 450 Scooter, Top raising super features, Electric Scooters details in telugu
Electric Scooters: అలరిస్తున్న ఏథర్ 2025 స్కూటర్.. టాప్ లేపుతున్న సూపర్ ఫీచర్లు
భారతదేశంలో ఈవీ స్కూటర్లు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా అన్ని కంపెనీలు సూపర్ ఫీచర్స్‌తో తమ 2025 మోడల్స్‌ను ప్యాక్ చేస్తున్నారు. భారతదేశంలో ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఏథర తన 2025 మోడల్ 450 సిరీస్‌ను ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి. 450 ఎక్స్, 450 అపెక్స్ స్కూటర్లను మెరుగైన సాంకేతికతతో అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏథర్ 2025 మోడల్ టాప్ ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Jan 12, 2025 | 7:00 AM

మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ ఏథర్ 2025 మోడల్ టాప్ ఫీచర్‌గా ఉంటుంది. ఈ రెండు మోడల్స్ స్కూటర్లు భద్రత, స్థిరత్వం కోసం మూడు మోడ్‌లతో కూడిన మల్టీ-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్‌ను కలిగి ఉంటాయి. రెయిన్, రోడ్, ర్యాలీ వంటి రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

ఏథర్ 450 మెరుగైన బ్యాటరీ పరిధిని అందిస్తాయి. 450 ఎక్స్ 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 130 కి.మీ ట్రూ రేంజ్‌ను అందిస్తుంది. 450 అపెక్స్ ఐడీసీ పరిధితో 157 కి.మీ ఉంటే ట్రూ రేంజ్ 130 కి.మీ అందిస్తుంది.

ఏథర్ స్టాక్ 6 సాఫ్ట్‌వేర్ ఇంజిన్ ఏథర్ 450 2025 మోడల్ డ్యాష్‌బోర్డ్‌లో గూగుల్ మ్యాప్స్, అలెక్సా ఇనిగ్రేషన్, వాట్సాప్ నోటిఫికేషన్‌లు వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది, ఇది స్మార్ట్ కనెక్టెడ్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

450ఎక్స్ 2025 మోడల్ మ్యాజిక్ ట్విస్ట్‌ను పరిచయం చేస్తుంది..రైడర్ ఎంగేజ్‌మెంట్‌ను రెస్పాన్సివ్ మరియు డైనమిక్ కంట్రోల్‌తో మెరుగుపరుస్తుంది.పనితీరు, శ్రేణిని మెరుగుపరచడానికి ఎంఆర్ఎఫ్ సహకారంతో రూపొందిచిన టైర్లు ఆకట్టుకుంటాయి.

ఏథర్ 450 ఎక్స్ 2025 మోడల్ ధర రూ. 1,56,999 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) ఉంటుంది. ఏథర్ 450 అపెక్స్ రూ. 1,99,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.




