AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: న్యూ ఇయర్ నొప్పితో మొదలైంది.. వైరల్‌గా మారిన రష్మిక పోస్ట్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రెగ్యులర్ గా జిమ్ చేస్తుంది. తద్వారా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటోంది. అయితే ఇప్పుడు అదే ఆమెకు సమస్యను తెచ్చిపెట్టింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా రష్మిక గాయపడింది. దీంతో సినిమా షూటింగుల నుంచి కాస్త విశ్రాంతి కోరింది. కోలుకున్న తర్వాతనే మళ్లీ సినిమా పనుల్లో బిజీ కానుంది.

Rashmika Mandanna: న్యూ ఇయర్ నొప్పితో మొదలైంది.. వైరల్‌గా మారిన రష్మిక పోస్ట్
Rashmika
Rajeev Rayala
|

Updated on: Jan 12, 2025 | 8:02 AM

Share

అందాల భామ రష్మిక మందన్న రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. అయితే తాజగా ఈ బ్యూటీ జిమ్ లో గాయపడింది. వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ కాలికి గాయం అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో సౌత్ ఇండియా విన్నింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది స్టార్ రష్మిక మందన. ప్రస్తుతం ఈ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘సికిందర్’ సినిమాతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో జతకడుతుంది. సల్మాన్, రష్మిక జంటగా తెరపై కనిపించడం ఇదే తొలిసారి. అయితే ఇప్పుడు రష్మిక సినిమాకు బ్రేక్ ఇచ్చింది. జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయపడటంతో విశ్రాంతి తీసుకుంటుంది.

జిమ్‌లో వ్యాయామ సమయంలో గాయం కారణంగా రష్మిక మందన విశ్రాంతి తీసుకుంటుంది. దాంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఈ ముద్దుగుమ్మే వెల్లడించింది. నటుడు తన కుడి పాదం కట్టుతో ఉన్న చిత్రాన్ని పంచుకుంది.  రష్మికాకు గాయం అవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. రష్మిక తన పోస్ట్ కింద ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ నొప్పితో మొదలైందని, అది ఎప్పుడు బాగుపడుతుందో తెలియక ఆశతో ఉన్నానని రష్మిక పేర్కొంది.

నేను ప్రస్తుతం ఆశ మోడ్‌లో ఉన్నాను. వారాలు లేదా నెలలు పట్టవచ్చు, దేవునికి మాత్రమే తెలుసు. నేను ఇప్పుడు థమ, సికందర్, కుబేర షూటింగ్ సెట్స్‌కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను. ఆలస్యానికి దర్శకులు నన్ను క్షమించండి. నేను రికవర్ అయిన వెంటనే తిరిగి వస్తాను. అని రాసుకొచ్చింది రష్మిక మందన్న. ఇటీవలే రష్మిక మందన్న,సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తున్న సికందర్ చివరి షెడ్యూల్ ప్రారంభం అయ్యింది.  ముంబైలో షూటింగ్ జరిపి.. చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనుకున్న సమయానికి పూర్తి చేస్తారన్న నమ్మకంతో టీమ్ ఉంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సికందర్. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో పాటు కాజల్ అగర్వాల్, రష్మిక, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ కూడా నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే
400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే