AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2022: కమలా హారిస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు.. అమెరికాలో దీపావళి జరుపుకుంటున్న సెలబ్రిటీలు

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

Diwali 2022: కమలా హారిస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు.. అమెరికాలో దీపావళి జరుపుకుంటున్న సెలబ్రిటీలు
Donald Trump celebrates Diwali
Sanjay Kasula
|

Updated on: Oct 23, 2022 | 1:44 PM

Share

అమెరికాలో దీపావళి వేడుకలు ఊపందుకున్నాయి. ఫ్లోరిడాలోని మార్లగో సిటీలోని ట్రంప్ నివాసంలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటారు. రిపబ్లికన్ హిందూ కొయిలేషన్ తరఫున సుమారు 200 మంది వరకూ హిందువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ భారతీయులందరికి వారి సంప్రదాయ పద్ధతుల్లో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లేట్ వెయ్యి డాలర్ల వరకూ ఉంటుందని. ఇంతటి భారీ దీవాలీ విందునిచ్చిన ట్రంప్ ఈసారి జరిగే ఎన్నికల్లో తిరిగి అధ్యక్షుడవ్వాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు భారతీయ అతిథులు. ఈ సందర్భంగా పలు భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని ఎంతగానో అలరించాయి.

దీంతో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి నిల్వ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. షాపింగ్ వీధుల్లో అదుపు చేయలేని రద్దీ ఉంది. ఈ ఏడాది దీపావళి ప్రారంభం నుంచే కలుపుగోలుగా ఉంది. దీపావళిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు నివసించే దేశాలలో కూడా జరుపుకోవడం ప్రారంభమైంది.

అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ అక్కడ దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ ఏడాది అమెరికాలోని ఇతర భారతీయులతో కలిసి అమెరికాలోని తన అధికారిక నౌకాదళ గృహంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి, రాష్ట్రపతి ప్రత్యేక సలహాదారు నీరా టాండన్, బిడెన్ ప్రసంగ రచయిత వినయ్ రెడ్డి పాల్గొన్నారు. నిన్న డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా ఇంట్లో దీపావళి వేడుకలు జరిగాయి. ఇందులో దాదాపు 2000 మంది భారతీయులు పాల్గొన్నారు. దీపావళి పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం