Rishab Shetty: హనుమంతుడితో ఆటలా… రిషబ్ శెట్టి మూవీ పై ఫిర్యాదు..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించగా.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.

Rishab Shetty: హనుమంతుడితో ఆటలా... రిషబ్ శెట్టి మూవీ పై ఫిర్యాదు..
Jai Hanuman
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 12, 2025 | 7:14 AM

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం ‘కాంతార 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కన్నడ హీరో అయినా రిషబ్ శెట్టి కాంతార సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన అందర్నీ ఆకట్టుకుంది. కాంతార సినిమాకు కాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు రిషబ్ శెట్టి. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టికి తెలుగు, హిందీ సినిమాల నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు వస్తున్నాయి. రిషబ్ శెట్టి తెలుగులో సూపర్ హిట్ సినిమా ‘హనుమాన్’ని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్, చిన్న టీజర్ విడుదలయ్యాయి. హనుమంతుడి పాత్రకు రిషబ్ ను ఎంచుకోవడం పై ప్రశాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. కానీ కొంతమంది మాత్రం దీని పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రిషబ్ శెట్టి సహా చిత్రబృందంపై కూడా ఫిర్యాదు చేశారు కొందరు. ‘జై హనుమాన్’ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో రిషబ్ శెట్టి నటించనున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్‌లో రిషబ్ శెట్టి పొడవాటి గడ్డంతో రాముడి విగ్రహాన్ని కౌగిలించుకున్న చిత్రం ఉంది. టీజర్ కూడా దాదాపు అలాగే ఉంది. ‘జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడి పాత్రను ఇంతకుముందు భారతీయ సినిమాలో నిర్మించిన అన్ని పౌరాణిక చిత్రాల కంటే భిన్నంగా చూపించారు.

జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడి రూపురేఖలే మారిపోయాయి. అందరికీ తెలిసినట్లుగా, హనుమంతుడి ముఖం కోతిలా ఉంటుంది. కానీ ‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి ముఖాన్ని సామాన్యుడి ముఖంగా చూపించారు. హనుమంతుడిని కోతి రూపంలో చూపించలేదన్న కారణంతోనే ఇప్పుడు తిరుమలరావు అనే న్యాయవాది ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ, చిత్ర నిర్మాణ సంస్థ రిషబ్ శెట్టి , మైత్రి మూవీ మేకర్స్ పై నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. హనుమంతుని ముఖాన్ని మార్చడం ద్వారా, హనుమంతుని పాత్రను మార్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా ఉన్న పోస్టర్‌లు, టీజర్‌లను ఉపసంహరించుకోవాలని కోరుతూ తిరుమల వర్మ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’ సినిమా రామాయణం తర్వాత కథను కవర్ చేయనుంది. ఇది హనుమంతుడు రాముడికి ఇచ్చిన వాగ్దాన కథను ప్రశాంత్ చూపించనున్నారు. మరి ఈ వివాదం పై జై హనుమాన్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు