Nail Cutting: ఏ రోజున గోర్లు కట్ చేస్తే మీ అదృష్టం దూరం అవుతుందో తెలుసా?
మన పూర్వీకులు కొన్ని చిన్న చిన్న ఆచారాలను పాటించడం ద్వారా శుభాన్ని, శ్రేయస్సును పొందవచ్చని నమ్మేవారు. అదే విధంగా, వారంలోని కొన్ని రోజులలో గోళ్లను కత్తిరించడం అరిష్టమని, ఇది ఇంట్లో దరిద్రాన్ని ప్రతికూల శక్తిని తెచ్చిపెడుతుందని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, ఈ నాలుగు రోజుల్లో గోళ్లు తీయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై, అనవసరమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే, మీ ఇంట్లో సంపద నిలవాలంటే, ఈ ముఖ్యమైన నియమాలను తప్పకుండా పాటించాలి.

హిందూ సంప్రదాయాల్లో ఎప్పటినుంచో కొన్ని విషయాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అందులో ఒకటి గోర్లు కత్తిరించడం. ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు కత్తిరించడకూడదని మన పెద్దవాళ్లు సైతం చెప్తుంటారు. ఇందులో నిజమెంత?.. అసలు ఏ రోజుల్లో గోర్లు కత్తిరించాలి, ఎప్పుడు చేయకూడదు అనే విషయాలు ఇప్పటికీ చాలా మందికి సరైన అవగాహన లేదు. జ్యోతిష్య నిపుణులు శాస్త్రాల ప్రకారం, ఈ క్రింది నాలుగు రోజుల్లో గోర్లు కత్తిరించడం అశుభమని భావించాలి.
శనివారం :
శనివారం రోజున గోళ్లు కత్తిరించడం అనేది శని దేవుడికి కోపం తెప్పిస్తుందని నమ్మకం. ఇది శని దోషాన్ని పెంచుతుంది, తద్వారా జీవితంలో సమస్యలు, కష్టాలు పెరిగిపోతాయి. ఈ రోజు గోర్లు తీయడం వల్ల ఆర్థిక నష్టం లేదా వ్యాపారంలో నష్టం కలగడానికి అవకాశం ఉంది.
మంగళవారం :
మంగళవారం రోజున గోళ్లు కత్తిరించడం వల్ల ఆ ఇంట్లో రుణాలు పెరగడం, కోర్టు సమస్యలు రావడం జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మంగళవారం శక్తికి, ఉగ్ర రూపానికి సంబంధించిన రోజు; ఈ రోజున గోళ్లు కత్తిరించడం వల్ల ఇంట్లో అశుభాలు జరుగుతాయని భావిస్తారు.
గురువారం :
గురువారం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఈ రోజున గోళ్లు లేదా వెంట్రుకలు తీయడం వల్ల ఆయుష్షు తగ్గడం, అదృష్టం దూరం కావడం జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ తప్పు చేయడం వలన ఇంట్లో ధనం నిలవదని, ధన నష్టం సంభవిస్తుందని నమ్మకం.
అమావాస్య :
ఏ నెలలోనైనా అమావాస్య రోజును అశుభంగా భావిస్తారు. ఈ రోజున గోళ్లు కత్తిరించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు పెరిగి, మానసిక ఒత్తిడి, భయం వెంటాడతాయి. ఈ కారణంగా లక్ష్మీదేవి కటాక్షం లోపిస్తుంది.
గోళ్లు కత్తిరించడానికి శుభ దినాలు
మరి దరిద్రాన్ని పారదోలి, శుభాన్ని పొందాలంటే గోళ్లను ఏ రోజుల్లో కత్తిరించాలి?
గోళ్లు కత్తిరించడానికి సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం వంటి రోజులు శుభకరమైనవి. ముఖ్యంగా శుక్రవారం గోళ్లు కత్తిరించడం లక్ష్మీదేవికి సంతోషం కలిగిస్తుంది, తద్వారా ఇంట్లో సంపద పెరుగుతుంది.
గమనిక: ఈ సమాచారం పూర్తిగా భారతీయ శాస్త్రాలు, సాంప్రదాయ నమ్మకాలు మరియు జ్యోతిష్య చిట్కాల ఆధారంగా ఇవ్వబడింది. వ్యక్తిగత నమ్మకాలకు మాత్రమే పరిమితం.




