Business Ideas: ఎప్పుడూ డిమాండ్ ఉండే సూపర్ బిజినెస్..! నెలకు రూ.5 లక్షలు.. సెట్ అయితే జీవితం మారిపోయినట్టే..!
పండ్ల పంపిణీ వ్యాపారం ఎల్లప్పుడూ డిమాండ్ ఉండే లాభదాయకమైన రంగం. వివిధ ప్రాంతాల నుండి పండ్లను సేకరించి, కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసి, స్థానిక మార్కెట్‌లోని చిల్లర వర్తకులకు సరఫరా చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. సరైన ప్రణాళిక, పెట్టుబడితో ఈ బిజినెస్ స్థిరమైన లాభాలను అందిస్తుంది.

బిజినెస్‌లో ఉన్న డబ్బు ప్రపంచంలో మరే రంగంలో కూడా లేదు. ప్రస్తుత కాలంలో ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది బిజినెస్‌మెన్లే. అయితే బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వడం బిజినెస్ గురించి మాట్లాడుకున్నంత ఈజీగా. చెప్పుకోవడానికి ప్రతి బిజినెస్ ఐడియా అద్భుతంగా అనిపించినా.. గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంటుంది. కానీ, ప్రాక్టికల్‌గా ఎంత వేరేలా ఉన్నా.. కచ్చితంగా ఏ బిజినెస్ ఐడియా గురించి అయినా అందులోకి దిగేముందు కాస్త అవగాహన పెంచుకోవడం మంచిది. ఇప్పుడో మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఏ కాలంలోనైనా డిమాండ్ ఉండే బిజినెస్‌లు కొన్ని ఉంటాయి. అందులో కొటి ఫ్రూట్స్ బిజినెస్. సాధారణంగా షాపుల్లో, బండిలపైన మనం ఫ్రూట్స్ అమ్మడం చూస్తుంటాం. ఎందుకంటే ఎవరైనా ఫ్రూట్స్ అక్కడ కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్‌లో రోడ్డుకు అటూ ఇటూ పక్కన బండిలపై ఫ్రూట్స్ పెట్టి అమ్ముతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకొనబోయే బిజినెస్ ఐడియా అది కాదు. ఎప్పుడైనా గమనించారా? రోడ్ల పక్కన లేదా షాప్‌లో అమ్మే ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయో. ఎవరూ కూడా నేరుగా పండ్ల తోట నుంచి తెప్పుకోవరావడం కానీ, కొని తేవడం కానీ చేయరు. వారికి ఓ డిస్టిబ్యూటర్ వాటిని సప్లయ్ చేస్తుంటాడు.
అన్ని రకాల ఫ్రూట్స్‌ను వివిధ ప్రాంతాల నుంచి తెప్పించి. ఒక చోట నిల్వ చేసి అక్కడ నుంచి ఈ బండిల వాళ్లకు అమ్ముతుంటాడు. అతని దగ్గర బాక్సుల లెక్క కొని, ప్రజలకు అమ్ముతుంటారు. ఇప్పుడు ఈ డిస్టిబ్యూటర్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే.. మంచి డిమాండ్ ఉన్న బిజినెస్. ఏ ప్రాంతంలో ఎలాంటి పండ్లు పండుతాయి, చౌక లభిస్తాయనే అవగాహన పెంచుకొని, ఫ్రూట్స్ నిల్వ చేసేందుకు ఒక కోల్డ్ స్టోరేజీ లాంటిది ఏర్పాటు చేసుకొని అందులో నిల్వ ఉంచి లోకల్ మార్కెట్‌లో తోపుడు బండ్ల వాళ్లకు అమ్ముకుంటే చాలు మంచి ఆదాయం లభిస్తుంది. అయితే ఇందుకోసం పెట్టుబడి కూడా బాగానే అవుతుంది. కోల్డ్ స్టోరేజీ నిర్మాణం, ఒక వెహికల్, డ్రైవర్ వంటి ఖర్చులు ఉంటాయి. అయితే ఒక్కసారి ఈ బిజినెస్ సెట్ అయితే మాత్రం మంచి ఆదాయం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




