Sunil Deodhar: హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి… ఏపీ భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని.. విజయవాడలో సీతమ్మ విగ్రహాన్ని కూల్చిన ఘటన బాధాకరమని...

Sunil Deodhar: హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి... ఏపీ భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌
Sunil Deodhar
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 04, 2021 | 5:12 AM

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని.. విజయవాడలో సీతమ్మ విగ్రహాన్ని కూల్చిన ఘటన బాధాకరమని ఏపీ భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌ అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ తరహాలో 150 ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన భాజపా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఆలయాలపై దాడుల విషయంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఘటనా ప్రాంతాలను కూడా మంత్రులు పరిశీలించడంలేదని విమర్శించారు.

ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. దేవాదాయశాఖ మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయాలపై దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క కేసులోనూ దోషులను పట్టుకోలేకపోయారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సునీల్‌ దేవ్‌ధర్‌ హెచ్చరించారు.

Also Read: ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవడంలేదు: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్