AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramanujacharya Sahasrabdi: శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం.. ముత్తించల్‌లో తొలిరోజు కార్యక్రమాలు ఇవే

బుధవారం ఉదయం 8 గంటలకు శోభాయాత్ర, వాస్తుశాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 8 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఉత్సవాల్లో కీలకమైన..

Ramanujacharya Sahasrabdi: శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం.. ముత్తించల్‌లో తొలిరోజు కార్యక్రమాలు ఇవే
Statue Of Equality Ramanujacharya Millennium Celebration
Sanjay Kasula
|

Updated on: Feb 02, 2022 | 9:59 AM

Share

Statue of Equality: హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లువిరుస్తున్నాయి. రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ముచ్చింతల్‌లోని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్‌స్వామి ఆశ్రమ ప్రాంగణం సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఉయదం నుంచి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 రోజుల పాటు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. వేలాది మంది వాలంటీర్లు, రుత్విక్కులు, ఇతరుల రాకతో ముచ్చింతల్ లో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలు, తోరణాలతో పరిసర ప్రాంతాలన్నీ శోభాయమానంగా కనిపిస్తోంది.

అష్టాక్షరీమంత్ర జపంతో సహస్రాబ్ది మహోత్సవం ప్రారంభమయ్యింది. వాస్తు ఆరాధన, వాస్తు హోమం కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీలక్ష్మీనారాయణ మహా క్రతువు జరిగే యాగశాల స్థలంలో ఎలాంటి వాస్తు దోషాలకు తావులేకుండా వాస్తు పూజ నిర్వహిస్తారు. సమతామూర్తి వైభవాన్ని ప్రపంచానికి చాటేలా 12 రోజుల పాటు జరిగే వేడుకల కోసం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం రెడీ అయ్యింది.

సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి అంకురార్పణ ఈ సాయంత్రం జరగనుంది. వెయ్యి 35 కుండాలతో కూడిన లక్ష్మీనారాయణ మహా యాగంతో వేడుకలను ప్రారంభిస్తున్నారు. తొలుత ఆ ప్రాంత భూమి పూజ, వాస్తు పూజ నిర్వహిస్తారు. వివిధ సంప్రదాయాలను అనుసరించే 5 వేల మంది రుత్వికులు దీక్షధారణ చేసి పూజల్లో పాల్గొంటున్నారు.

ఈ సాయంత్రం కుండల్లోని పుట్టమట్టిలో నవధాన్యాలను అలకటం ద్వారా అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్‌స్వామి ఆశ్రమ ప్రాంగణంలో దాదాపు వెయ్యి కోట్ల భారీ వ్యయంతో 45 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ అద్భుత, దివ్య క్షేత్రం.. భక్తులకు కనువిందు చేస్తోంది.

ప్రాణికోటి అంతా ఒకటేనని..

వెయ్యేళ్ల కిందట ఎన్నో వైషమ్యాలు, వైరుధ్యాలు.. అంటరానితనం కరాళనృత్యం చేస్తున్న సమయంలో ప్రాణికోటి అంతా ఒకటేనని, మనుషుల మధ్య తేడాల్లేవని ఈ లోకానికి  సమానత్వ భావాలను నాటారు ఆచార్య రామానుజులు. మళ్లీ ఇప్పుడు అసమానతలు దేశ పురోగతికి అడ్డంకిగా మారుతున్న సమయంలో ఆయన నింపిన స్ఫూర్తి మరోసారి ప్రజల్లో రావాల్సిన అవసరం ఉందంటూ చిన్నజీయర్‌ స్వామి ఈ బృహత్‌ క్షేత్ర నిర్మాణానికి పూనుకున్నారు.

బుధవారం ఉదయం 8 గంటలకు శోభాయాత్ర, వాస్తుశాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 8 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఉత్సవాల్లో కీలకమైన హోమాలు మొదలు కానున్నాయి.

అరణి మతనం, అగ్నిప్రతిష్ట జరుగనున్నాయి. కార్య్రక్రమాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 7 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.

Ramanujacharya Sahasrabdi: ఘనంగా శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోత్సవం.. ముచ్చింతల్ లో ప్రారంభమైన వేడుకలు..