AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే.. ఫిబ్రవరి 11 నుంచి వేడుకలు.. ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం..

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం.. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా.. అష్టాదశ శక్తిపీఠాల్లోనూ ఒకటిగా వెలుగులీనుతుంది..

Srisailam: శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే.. ఫిబ్రవరి 11 నుంచి వేడుకలు.. ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం..
Srisailam Temple
Ganesh Mudavath
|

Updated on: Jan 31, 2023 | 8:02 PM

Share

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం.. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా.. అష్టాదశ శక్తిపీఠాల్లోనూ ఒకటిగా వెలుగులీనుతుంది. మాహా శివరాత్రి పర్వదినం సందర్భంగా.. శ్రీశైలంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో.. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి 7 నుంచి 21 వరకు స్వామివారి ఆలయంలో భక్తులకు స్పర్శ దర్శనం రద్దు చేశారు. భక్తులందరికీ అలంకార దర్శనానికి అనుతించనున్నట్లు కలెక్టర్ మనజీర్ జిలాని వెల్లడించారు. శివస్వాములకు సైతం ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు మాత్రమే గర్భాలయ స్పర్శ దర్శనాలకు అనుమతి కల్పించనున్నారు. ఫిబ్రవరి 14న తిరుమల దేవస్థానం తరఫున, 15 న రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. సులభంగా ప్రయాణం చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 820 బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం సుమారు 30 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచనున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 8 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సమావేశం అనంతరం ఆలయం, పరిసరాలు, క్యూలైన్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.

ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో భాగంగా బస్సులు, ఇతర వాహనాలను రింగ్‌రోడ్డు మీదుగా పార్కింగ్‌ ప్రదేశాలకు మళ్లిస్తారు. ప్రతి కిలో మీటర్‌కు ఒకచోట సత్రాలు, వసతి సముదాయాల వివరాలతో సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. తాగునీటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు 30 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆలయ మాడవీధులు, క్షేత్ర పరిధిలో చలువ పందిళ్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..