Tirumala Ugadi: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉగాధి ఆస్థానం.. భక్తి పారశ్యంతో పులకించిన భక్త కోటి

తిరుమల శ్రీవారి ఆలయం ఉగాది శోభతో ఆకట్టుకుంది. 10 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అలంకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించింది. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం శుద్ధి అనంతరం పంచాంగ శ్రవణం చేపట్టింది. శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు ఆగమ పండితులు, అర్చకులు.

Tirumala Ugadi: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉగాధి ఆస్థానం.. భక్తి పారశ్యంతో పులకించిన భక్త కోటి
Ttd Ugadi
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 09, 2024 | 11:58 AM

తిరుమల శ్రీవారి ఆలయం ఉగాది శోభతో ఆకట్టుకుంది. 10 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అలంకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించింది. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం శుద్ధి అనంతరం పంచాంగ శ్రవణం చేపట్టింది. శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు ఆగమ పండితులు, అర్చకులు. ఉగాది ఆస్థానం సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేసింది టిటిడి.

ఇక ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధింది టిటిడి. క్రోది నామ కొత్త సంవత్సరం రోజు ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారికి విష్వక్సేనుల వారికి విశేష ఆభరణాలు సమర్పణ జరగ్గా 7 గంటల నుంచి 9 గంటలకు ఉత్సవ మూర్తులు ఆలయంలోకి ప్రవేశం జరిగింది. అనంతరం గర్భాలయంలో స్వామివారికి, ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలు సమర్పణ చేశారు అర్చకులు. అనంతరం పంచాంగ శ్రవణం చేపట్టారు ఆలయ ఆగమపండితులు అర్చకులు. మరోవైపు ఈ నెల 21 నుంచి శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు జరగనున్నాయి. మూడు రోజులపాటు వసంతోత్సవాలు నిర్వహించనున్న టిటిడి ఈ నెల 21 నుంచి 23 వరకు పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది.

అటు శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఉగాది సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించు కునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఆలయ ఛైర్మెన్ శ్రీనివాసులు, ఇఓ నాగేశ్వరరావు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు.. భక్తుల రద్దీ దృష్ట్యా ఇబ్బంది కలగకుండా క్యులైనలను పర్యవేక్షించారు ఆలయ అధికారులు. ఇక కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో ఉగాది ఆస్థానం జరిగింది. దేవస్థానం కళ్యాణ మండపంలో 10 గంటలకు పంచాంగ శ్రవణం చేపట్టారు. తెల్లవారుజామున 3 గంటలకు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు అర్చకులు నిర్వహించారు. భక్తులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల పుష్పాలతో ఆలయం అలంకరణ చేపట్టారు అధికారులు. ఉదయం 6 గంటల నుంచి భక్తులకు గణనాధుడి సర్వదర్శనానికి అనుమతించారు. మూలవిరాట్ కు వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఉగాది రోజు గణనాథుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles