Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neechbhang Raj Yoga: శుక్రుడి వల్ల బుధుడికి నీచ భంగం.. ఆ రాశుల వారికి రాజయోగం!

ఈ నెల 10వ తేదీ నుంచి మే 8 వరకు బుధుడు మీన రాశిలో సంచారం చేయబోతున్నాడు. బుధుడికి మీనం శత్రు క్షేత్రం. పైగా నీచ క్షేత్రం. వీటితో పాటు బుధుడు వక్రించడం కూడా జరిగింది. ఈ విధంగా మూడు దోషాలతో ఉన్న బుధుడి వల్ల సాధారణంగా అశుభ ఫలితాలు, అశుభ యోగాలే ఎక్కువగా ఉంటాయి. అయితే, అదే రాశిలో ఉచ్ఛపట్టిన శుక్రుడి వల్ల బుధుడికి నీచ భంగం జరిగింది.

Neechbhang Raj Yoga: శుక్రుడి వల్ల బుధుడికి నీచ భంగం.. ఆ రాశుల వారికి రాజయోగం!
Neechabhang Raja Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 09, 2024 | 4:44 PM

ఈ నెల 10వ తేదీ నుంచి మే 8 వరకు బుధుడు మీన రాశిలో సంచారం చేయబోతున్నాడు. బుధుడికి మీనం శత్రు క్షేత్రం. పైగా నీచ క్షేత్రం. వీటితో పాటు బుధుడు వక్రించడం కూడా జరిగింది. ఈ విధంగా మూడు దోషాలతో ఉన్న బుధుడి వల్ల సాధారణంగా అశుభ ఫలితాలు, అశుభ యోగాలే ఎక్కువగా ఉంటాయి. అయితే, అదే రాశిలో ఉచ్ఛపట్టిన శుక్రుడి వల్ల బుధుడికి నీచ భంగం జరిగింది. ఈ నీచభంగం వల్ల బుధుడు కొన్ని రాశులకు తప్పకుండా రాజయోగం కలిగిస్తాడు. దీన్ని నీచభంగ రాజయోగం అంటారు. మేషం, మిథునం, సింహం, కన్య, తుల, మకర రాశుల వారికి ఈ నీచభంగ రాజయోగం పట్టడం వల్ల తప్పకుండా కొన్ని శుభ యోగాలు కలుగుతాయి. అవి ఎటువంటి ఫలితాలిస్తాయో ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో శుక్రుడితో కలిసిన బుధుడు తప్పకుండా విదేశీ యానానికి, విదేశీ సొమ్ము అనుభవించడానికి అవకాశం కలిగిస్తాడు. బాగా పొదుపు పాటించి, ఖర్చులు తగ్గించు కోవడం జరుగుతుంది. ఫలితంగా బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశముంది. గృహ, ఆస్తి ఒప్పందాలు కుదర్చుకుంటారు. ఉద్యోగంలో శత్రువుల బెడద తగ్గు తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సంఖ్య తగ్గి లాభాలు పెరగడం ప్రారంభిస్తాయి.
  2. మిథునం: ఈ రాశ్యధిపతి బుధుడు దశమంలో నీచభంగం పొందడం వల్ల దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇప్పుడు అనుభవానికి రావడం ప్రారంభిస్తాయి. గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశముంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. తల్లితండ్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
  3. సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడితో కలిసిన బుధుడి వల్ల వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి చాలా వేగంగా పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. రాదనుకున్న సొమ్ము అతి తేలికగా చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులతో పాటు జీతభత్యాలు బాగా పెరు గుతాయి. ఏ వ్యాపారమైనా ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
  4. కన్య: ఈ రాశినాథుడైన బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్రుడితో కలవడం వల్ల విపరీతంగా బలం పుంజుకోవడం జరిగింది. ఫలితంగా ఈ రాశివారికి రాజయోగం పట్టే అవకాశముంది. అనూహ్యంగా ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చే సూచనలున్నాయి. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి సంబంధం కుదరడం గానీ జరుగుతుంది. వృత్తి జీవి తం బిజీ అవుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి.
  5. తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో బుధుడికి నీచభంగం జరిగినందువల్ల అనుకోకుండా ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం జరుగుతుంది. దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి కలిగి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు విస్తరి స్తాయి. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, రాబడి పెరు గుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.
  6. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో నీచభంగ రాజయోగం ఏర్పడినందువల్ల అతి వేగంగా ఆర్థిక పురోగతి చోటు చేసుకుంటుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి. సరికొత్త గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు పదోన్నతికి కూడా అవకాశముంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.

ట్రంప్ దెబ్బకు.. అమెరికన్లకు చెప్పుకోలేని కష్టం..
ట్రంప్ దెబ్బకు.. అమెరికన్లకు చెప్పుకోలేని కష్టం..
ప్రధాని మోదీ మన్​ కీ బాత్​లో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ ప్రస్తావన
ప్రధాని మోదీ మన్​ కీ బాత్​లో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ ప్రస్తావన
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి శోభాశెట్టి పూజలు.. కారణమిదేనట
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి శోభాశెట్టి పూజలు.. కారణమిదేనట
మీ గోల్డ్‌ నగలు ఇతరులకు ధరించేందుకు ఇస్తున్నారా? ఓ క్షణం ఆగండి..
మీ గోల్డ్‌ నగలు ఇతరులకు ధరించేందుకు ఇస్తున్నారా? ఓ క్షణం ఆగండి..
నేను చెడ్డ నటుడిని కాదు.. కాంతార సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వండి..
నేను చెడ్డ నటుడిని కాదు.. కాంతార సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వండి..
పరగడుపున నెయ్యి తీసుకుంటే మీ శరీరంలో జరిగే మార్పు ఇదే..
పరగడుపున నెయ్యి తీసుకుంటే మీ శరీరంలో జరిగే మార్పు ఇదే..
విశ్వావసునామ సంవత్సరం గురించి సంచలన విషయాలు బయటపెట్టిన వేణుస్వామి
విశ్వావసునామ సంవత్సరం గురించి సంచలన విషయాలు బయటపెట్టిన వేణుస్వామి
పీటలదాకా వచ్చిన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.. కట్ చేస్తే
పీటలదాకా వచ్చిన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.. కట్ చేస్తే
పొలం గట్టుపై కనిపించిన వింత ఆకారాలు..
పొలం గట్టుపై కనిపించిన వింత ఆకారాలు..
తమన్నాతో బ్రేకప్‌.. విజయ్ వర్మ అలా అనేశాడేంటి?
తమన్నాతో బ్రేకప్‌.. విజయ్ వర్మ అలా అనేశాడేంటి?