Ugadi Laxmi Yoga: మీన రాశిలో శుభ గ్రహాల కలయిక.. ఉగాది నుంచి ఆ రాశుల వారికి లక్ష్మీయోగాలు..!

సాధారణంగా గ్రహ సంచారంలో ఏ రెండు శుభ గ్రహాలు కలిసినా తప్పకుండా లక్ష్మీయోగం పడుతుంది. గురు, శుక్ర, బుధ గ్రహాలు రెండు గ్రహాలు కలిస్తే చాలు తప్పకుండా ధన ధాన్య వృద్ధి కలుగుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ నెల 9న ఉగాది సందర్భంగా మీన రాశిలో, అంటే గురువుకు సంబంధించిన రాశిలో శుక్ర, బుధ గ్రహాలు కలవడం జరుగుతోంది.

Ugadi Laxmi Yoga: మీన రాశిలో శుభ గ్రహాల కలయిక.. ఉగాది నుంచి ఆ రాశుల వారికి లక్ష్మీయోగాలు..!
Laxmi Yoga
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 09, 2024 | 11:16 AM

సాధారణంగా గ్రహ సంచారంలో ఏ రెండు శుభ గ్రహాలు కలిసినా తప్పకుండా లక్ష్మీయోగం పడుతుంది. గురు, శుక్ర, బుధ గ్రహాలు రెండు గ్రహాలు కలిస్తే చాలు తప్పకుండా ధన ధాన్య వృద్ధి కలుగుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ నెల 9న ఉగాది సందర్భంగా మీన రాశిలో, అంటే గురువుకు సంబంధించిన రాశిలో శుక్ర, బుధ గ్రహాలు కలవడం జరుగుతోంది. శుక్రుడికి ఇది ఉచ్ఛ రాశి, బుధుడికి నీచ రాశి అయినప్పటికీ ఈ రెండు శుభ గ్రహాల కలయిక వల్ల బుధుడికి నీచ భంగ రాజయోగం కలిగింది. ఈ శుభ గ్రహాల యుతికి సంబంధించిన శుభ ఫలితాలు, శుభ యోగాలు ఈ నెల 23వరకు కొనసాగడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల కలియిక వల్ల శుభ యోగాలను అనుభవించబోయేది వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, కుంభ రాశులు.

  1. వృషభం: ఈ రాశికి లాభస్థానంలో బుధ, శుక్ర గ్రహాలు కలవడం వల్ల ఈ రాశివారికి మహా లక్ష్మీయోగం పడుతోంది. ఈ రాశివారి ఓర్పు, సహనాలకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రతి ఆర్థిక ప్రయత్నం సఫ లమవుతుంది. అప్రయత్నంగా డబ్బు కలిసి వస్తుంది. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు. భూ క్రయ విక్రయ వ్యవహారాల ద్వారా కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల కలయిక వల్ల ఉద్యోగంలో పదోన్నతి, జీత భత్యాల పెరుగుదల, అదనపు రాబడి వంటివి అనుభవానికి వస్తాయి. వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతులు తొక్కుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. మంచి రాబడికి అవకాశమున్న ఉద్యోగంలోకి మారే అవకాశముంది. ఆస్తి విలువ పెరుగుతుంది. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ, శుక్రులు కలవడం వల్ల అనేక విధాలుగా ఉద్యోగ సంబంధమైన లాభాలు కలుగుతాయి. మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశముంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది. విలాస జీవితం అనుభవించే యోగం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, వృత్తిని విస్తరించడం వంటివి జరుగుతాయి.
  4. కన్య: ఈ రాశికి సప్తమంలో బుధ, శుక్రులు కలవడం అనేది ఒక అరుదైన అదృష్ట యోగం. దీన్ని జ్యోతిషశాస్త్రంలో ధర్మకర్మాధిప యోగంగా చెబుతారు. ఈ యోగం వల్ల అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఆర్థిక ఫలితాలు కలగడంతో పాటు, అధికార యోగం కూడా పట్టే అవకాశముం టుంది. వీరి మనసులోని కోరికలు నెరవేరుతాయి. దాన ధర్మాలతో మంచి పేరు తెచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో వీరు అధికారపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా అందలాలు ఎక్కుతారు.
  5. ధనుస్సు: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాలు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆక స్మిక అధికార యోగంతో పాటు ఆకస్మిక ధన లాభం కూడా ఉంటుంది. ఆర్థికంగా ఏ పని చేసినా తప్పకుండా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా స్థాయి, హోదా పెరుగు తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. లాభదాయక మార్గాల్లో పెట్టు బడులు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మున్ముందు లాభపడతారు.
  6. కుంభం: ఈ రాశికి ధన స్థానంలో రెండు శుభ గ్రహాలు కలవడం వల్ల ధన ప్రవాహం బాగా ఉంటుంది. చేతల ద్వారానే కాక మాటల ద్వారా కూడా సంపాదించడం జరుగుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆర్థిక, ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక నిపుణులు, బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయ నాయకులు అపర కుబేరులయ్యే అవకాశముంది. తల్లి లేదా భార్య వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.