ఉగాది తర్వాత ఆ రాశుల వారికి గ్రహ బలం.. వారికి ఆర్థిక, అధికార యోగాలు పక్కా..!

ఉగాది తర్వాత అంటే.. ఈ నెల 14న రవి తన ఉచ్ఛ రాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. రవి ఇక్కడ వచ్చే నెల 15 వరకూ ఉంటాడు. రవికి మిత్ర గ్రహాలైన గురువు, కుజుడు, చంద్రుడు ఈ నెల రోజుల కాలంలో బాగా యాక్టివ్ అవుతారు. ఫలితంగా, ఈ గ్రహాలకు చెందిన రాశులకు జీవితం యోగదాయకంగా సాగిపోతుంది.

ఉగాది తర్వాత ఆ రాశుల వారికి గ్రహ బలం.. వారికి ఆర్థిక, అధికార యోగాలు పక్కా..!
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 09, 2024 | 11:17 AM

ఉగాది తర్వాత అంటే.. ఈ నెల 14న రవి తన ఉచ్ఛ రాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. రవి ఇక్కడ వచ్చే నెల 15 వరకూ ఉంటాడు. రవికి మిత్ర గ్రహాలైన గురువు, కుజుడు, చంద్రుడు ఈ నెల రోజుల కాలంలో బాగా యాక్టివ్ అవుతారు. ఫలితంగా, ఈ గ్రహాలకు చెందిన మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులకు జీవితం యోగదాయకంగా సాగిపోతుంది. అధికారాన్ని అనుభవించడంతో పాటు ఆర్థికంగా కూడా వీరు దూసుకుపోతారు. గ్రహ రాజైన రవి ఉచ్ఛస్థితికి రావడంతోనే అతని సింహ రాశికి, అతని మిత్ర గ్రహాలకు చెందిన రాశులకు యోగం పట్టడం ప్రారంభమవుతుంది.

  1. మేషం: ఈ నెల 14 నుంచి ఈ రాశిలో రవి ఉచ్ఛపడుతున్నందువల్ల, ఇదే రాశిలో ఉన్న గురువుతో కల వడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం, ఆర్థిక యోగం పడతాయి. వృత్తి, ఉద్యో గాల్లో తప్పకుండా ప్రాభవం పెరుగుతుంది. అధికారంతో పాటు ఆదాయం కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశముంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం, బ్యాంక్ నిల్వలు వృద్ధి చెందడం జరుగుతుంది. రాజకీయాలు, పాలనా రంగంలో ఉన్నవారు అందలాలు ఎక్కుతారు.
  2. కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో రవి ఉచ్ఛస్థితికి వస్తున్నందువల్ల ఈ రాశివారికి అధికార యోగంతో పాటు కుబేర యోగం కూడా పట్టే అవకాశముంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి వెడతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశముంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారు బిజీ అయిపోతారు.]
  3. సింహం: ఈ రాశ్యధిపతి రవి ఉచ్ఛపట్టడమే కాక, ధన కారకుడైన గురువుతో కలుస్తున్నందువల్ల తప్ప కుండా అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయంగా ప్రాముఖ్యం సంపాదించుకుంటారు. విపరీతంగా ధనార్జనకు అవకాశం ఉంటుంది. స్థితిగతులు, జీవనశైలి పూర్తిగా మారిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో రవి ఉచ్ఛపడుతున్నందువల్ల, రాశ్యధిపతి కుజుడు కూడా అను కూలంగా ఉన్నందువల్ల తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు రెట్టింపవు తాయి. గృహ, వాహన సౌకర్యాలమీద దృష్టి కేంద్రీకరిస్తారు. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఒకటి రెండు కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం, రాశ్యధిపతి గురువుతో యుతి చెందడం ఈ రాశి వారికి తప్పకుండా రాజయోగం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవ డంతో పాటు ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా ఆర్థికంగా లాభిస్తుంది. సంపన్న వర్గంలో పెళ్లి నిశ్చయం అవుతుంది. నిరుద్యోగులకు అంచనాలకు మించిన జీతభత్యాలతో ఉద్యోగం లభించే అవకాశముంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు కలుగుతాయి.
  6. మీనం: ఈ రాశికి ధన స్థానంలో రవి ఉచ్ఛపట్టడం, రాశ్యధిపతి గురువుతో యుతి చెందడం వల్ల ఈ రాశి వారు తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు వెళ్ల డంతో పాటు భారీ మొత్తాల్లో జీతభత్యాలు అందుకునే అవకాశం కూడా ఉంది. వీరి పలుకుబడి పెరుగుతుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా అనేక విధాలుగా లాభాలు పొందుతారు. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభి స్తుంది.

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా